
మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్థాయి బూత్ లెవెల్ ఏజెంట్స్ సమావేశంలో పాల్గొన్న కొల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు.
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో హైదరాబాద్ నగరంలోని ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన బూత్ స్థాయి ఎజెంట్ల సమావేశంలో కొల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన బ్లాక్ అద్యక్షులు వివిధ మండలాల అధ్యక్షులు,నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఐసీసీ అద్యక్షులు మల్లిఖార్జున ఖర్గే హాజరై రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై వివరించారు.