
Independence Day
స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకున మజీద్ మదర్స సదర్ సయ్యద్ మాజీద్
జహీరాబాద్ నేటి ధాత్రి:
79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఝరాసంగం మదర్సా జామియా హబీబా నిస్వాన్ మదర్సలో లో సదర్ సయ్యద్ మజీద్ జాతీయ జెండాను ఎగురవేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
రాష్ట్ర ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.దేశ స్వాతంత్ర్యం కోసం త్యాగాలు చేసిన అమరవీరులను, ఉద్యమకారుల పోరాటాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.ప్రతి భారతీయుడి గుండెలోనూ దేశభక్తి నిండిపోయే రోజు ఆగస్టు 15. ఇది మనకు కేవలం ఒక సెలవు రోజు కాదు, దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన పవిత్రమైన రోజు.ఈ రోజున మనం అందరం కుల, మత, ప్రాంతీయ భేదాలు మరచిపోయి, భారతీయులమనే గర్వంతో ఏకమవుతాం. దేశమంతా ‘వందేమాతరం’, ‘భారత్ మాతా కీ జై’ నినాదాలతో ప్రతిధ్వనిస్తుంది. ఇలాంటి గొప్ప రోజున మన ప్రియమైన వారికి శుభాకాంక్షలు చెప్పడం మన సంప్రదాయం. ఈ దేశభక్తి సందేశాలు మన బంధాలను మరింత బలోపేతం చేయడంతో పాటు, దేశభక్తిని, ఐక్యతను కూడా పెంచుతాయన్నారు,ఈ కార్యక్రమంలో మస్జిద్ గురువు మూఫ్తీ ఫిర్దోస్ హఫీస్ బాబర్ ఖాదర్ అలీ రాజ్ మహమ్మద్ అమీరుద్దీన్ మహమ్మద్ తదితరులు పాల్గొన్నారు,