కొత్తగూడ, నేటిధాత్రి:
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం గుండం పల్లి గుడి తండా శ్రీ రాజరాజేశ్వర స్వామి శివాలయంలో శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా పండిత్ భానుప్రసాద్ శాస్త్రి వారి దివ్య కరములచే హైందవ సాంప్రదాయ పద్ధతిలో కనుల పండుగ శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి చలువ పందిళ్ళు ముత్యాల తలంబ్రాలు సన్నాయి మేళాలు దివ్య మంగళ హారతులు
వరుడు రామయ్య తండ్రి వధువు సీతమ్మ తల్లి వారి వివాహము ను చుట్టూ నలు మూలాల గ్రామాల నుండి భక్తులు పోటెత్తారు శ్రీ శ్రీ సీతారాముల కళ్యాణం భక్తులు కనులారాగాంచిరి తీర్థ ప్రసాదములు పానకం స్వీకరించి మహా అన్నదానంలో పాల్గొని భోజనాలు స్వీకరించారు