భద్రాచలం నేటిదాత్రి
సీతారాం ఏచూరి సంతాప సభలో ప్రసంగించిన సాయి సూర్య
విద్యావేత్తగా సంఘ సేవకునిగా ఆధ్యాత్మిక ధర్మకర్తగా తెలుగు భాష పండితుడిగా ఏజెన్సీ ప్రాంత ప్రజలతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకు సుపరిచితులైన మాగంటి సూర్యం అభ్యుదయ భావ కవి గ కవులను కళాకారులను ప్రోత్సహిస్తూ ఈ ప్రాంత కళాకారులలో దాగి ఉన్న కలను బయట ప్రపంచానికి తెలిసే విధంగా ప్రోత్సహిస్తూ అనేక రకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అటువంటి మాగంటి సూర్యం అడుగుజాడల్లో పయనిస్తూ ఆయన ఆశయ సాధనలోనే కొనసాగుతున్న మనవడు మాగంటి సాయి సూర్య సైతం తెలుగు భాష పై అత్యంత ప్రావీణ్యంతో పాల్గొన్న మొదటి వేదిక పైనే తనలో దాగి ఉన్న కవిని పరిచయం చేస్తూ మొదటి ఉపన్యాసం తోనే అందరి ప్రశంసలు మాగంటి సాయి సూర్య అందుకున్నారు. శనివారం పట్టణంలోని చాంబర్ ఆఫ్ కామర్స్ బిల్డింగ్ ఆవరణలో సిపిఐ ఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కామ్రేడ్ సీతారాం ఏచూరి సంతాప సభలో పాల్గొన్న మాగంటి సూర్యం మనవడు సాయి సూర్య ప్రసంగిస్తూ బడుగు బలహీన వర్గాల ప్రజల హక్కుల కోసం పోరాడిన సీతారాం ఏచూరి కి లాల్ సలాం తెలియజేస్తూ పుట్టుక నీది చావు నీది మధ్యలో జీవితమంతా ప్రజలది అంటూ కవితను ఊచరిస్తూ కటినమైన పదాలను సరళంగా పలుకుతూ మాట్లాడిన ఉపన్యాసం పట్ల వేదిక అలంకరించిన ప్రముఖులు మాగంటి సాయి సూర్య ని ప్రత్యేకంగా అభినందించారు. తన తాత ఆశయ సాధనను పరిపూర్ణం చేసే లక్ష్యంతో విద్యారంగంలోని కొనసాగుతూ ఏజెన్సీ ప్రాంతంలో అందరికీ కార్పొరేట్ విద్య అందించాలని పట్టణంలోని తాతగూడ సెంటర్ నందు ఉన్న లిటిల్ ఫ్లవర్స్ విద్యాసంస్థలను ఆధునికరించి సామాన్య విద్యార్థులకు కార్పొరేట్ విద్యను అందిస్తూ లిటిల్ ఫ్లవర్స్ విద్యా సంస్థలకు కో డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న మాగంటి సాయి సూర్య చిన్న వయసునుండే తన తాత సూర్యం సూచనలతో ఆయన అభిరుచి కి తగ్గట్టుగా కవితలు కవులు కళాకారులను అనుకరిస్తూ తెలుగు భాష పై పట్టును సాధిస్తూ తన ప్రత్యేకతను చాటుకున్నారు. అతి చిన్న వయసులోనే కమ్యూనిస్టు పార్టీ నిర్వహించిన పబ్లిక్ మీటింగ్ లో ఉపన్యసించటమే కాకుండా అందరి ప్రశంసలు అందుకున్న మాగంటి సాయి సూర్య భవిష్యత్తులో తన తాత పేరు కచ్చితంగా నిలబెడతారని అతని మొదటి ఉపన్యాసం విన్న రాజకీయ నాయకులు అభ్యుదయ భావ వాదులు విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.