Indiramma Sarees Distributed in Didgi Village
డిడ్గి గ్రామంలో: చీరలు పంపిణీ చేసిన కాంగ్రెస్ నాయకులు
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ మండల డిడ్గి గ్రామంలో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
జహీరాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పి. నరసింహ రెడ్డి,మహిళలకు చీరలను పంపిణీ చేశారు. ప్రతి మహిళకు ఉచితంగా చీరలు అందిస్తామని, మహిళా సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.
ఇటీ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ అక్బర్ హుస్సేన్,గ్రామ పంచాయతీ కార్యదర్శి రమ్య, సిఏ లక్ష్మమ్మ, వివో లీడర్స్, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సోమశేఖర్ ఐఎంసి డైరెక్టర్ మల్లారెడ్డి, మాజీ ఎంపిటిసి శ్రీనివాస్, సామెల్, సాంసంన్ సురేష్ పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు.
