
భద్రాచలం నేటి దాత్రి
ఉపాధి కూలీల వద్దకు వెళ్లి ప్రచారం నిర్వహిస్తున్న బిఆర్ఎస్ పార్టీ భద్రాచలం మాజీ నియోజకవర్గ ఇన్చార్జి మానే రామకృష్ణ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డాక అమలు చేస్తానన్న హామీలు ఆర్టీసీ ఫ్రీ బస్సు తప్ప మరి ఏ హామీ కూడా నెరవేర్చలేదని ఆయన అన్నారు వృద్ధాప్య పెన్షన్ కేసీఆర్ గారు 2000 రూ అమలు చేస్తుండగా 4000 రూపాయలు ఇస్తానని హామీ ఇచ్చి రేవంత్ రెడ్డి మాట తప్పడని కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇస్తానని మాయమాటలతో ప్రజలను మోసం చేశాడని, రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్న రేవంత్ రెడ్డి, కెసిఆర్ బస్సు యాత్రలో భాగంగా బిఆర్ఎస్ పార్టీ అధినేత కెసిఆర్ గర్జనతో తెలంగాణలోని రైతులందరికీ రైతుబంధు విడుదల చేశాడని మానే రామకృష్ణ గారు అన్నారు, కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి మాయమాటలు నమ్మి మోసపోవద్దని తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామరక్షగా కేసీఆర్ ఉన్నారని ఆయన అన్నారు
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు అన్నె సత్యనారాయణ మూర్తి మరియు బిఆర్ఎస్ పార్టీ డివిజన్ సీనియర్ నాయకులు సాగి శ్రీనివాసరాజు మరియు బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తంతారపల్లి వెంకటేశ్వరరావు, మడకం భూపతి, నక్క సిలువ కుమార్, బోడ లింగయ్య, వాగే కృష్ణ, పూసం దాస్, చెన్నం కృష్ణ, సోంపాక మంగయ్య, బిల్లీపెళ్లి రాము, మట్ట అర్జున్ తదితరులు పాల్గొన్నారు