
Electricity Safety Precautions
విద్యుత్ అత్యవసర పరిస్థి తిలో 1912 కు సంప్రదిం చాలి
విద్యుత్ ప్రమాదాల సూచ నలు ప్రజలు పాటించాలి
శాయంపేట నేటిధాత్రి:
విద్యుత్ ప్రమాదాల నివారణకు ప్రజలు సహకరించాలని విద్యుత్ అధికారి చందులాల్ మాట్లాడుతూ విద్యుత్ ప్రమాదాల ప్రధాన కారణాలు మరియు జాగ్రత్తలను వివరించారు విద్యార్థులు తల్లిదండ్రులు కూడా పాటించవలసిన జాగ్రత్తలు
తడిచిన చేతులతో విద్యుత్ పరికరాలు తాకరాదు.
వర్షాకాలంలో కరెంట్ స్తంభాలను పట్టుకోరాదు.
•పడిపోయిన విద్యుత్ తీగలకు దగ్గరగా వెళ్లరాదు, తాకరాదు.పవర్ లైన్ దగ్గర గాలిపటాలు ఎగరేయరాదు.
కరెంట్ ఉన్న తీగల దగ్గర ఇనుప దండలు వాడరాదు.
వాటర్ హీటర్, చార్జర్ వైర్లను చిన్నపిల్లలకు అందుబాటులో ఉంచరాదు.నాసిరకం వైర్లు, స్విచ్ బోర్డులు వాడరాదు.
ఇంటి పరికరాలకు ఎర్తింగ్ తప్పనిసరిగా చేయించుకో వాలి.ఛార్జింగ్ పెడుతూ ఫోన్ మాట్లాడరాదు లేదా ఆటలు ఆడరాదు.చిన్నపిల్లలు స్విచ్ బోర్డుల దగ్గరకు వెళ్లకుండా చూడాలి.విద్యార్థులు రైతులకు చెప్పవలసిన జాగ్రత్తలు ట్రాన్స్ఫార్మర్ల దగ్గర పశువులను మేపరాదు.
పంటచేలకు కరెంట్ ఫెన్సింగ్ వాడరాదు.ఇనుప స్టార్టర్ బాక్సులను వాడరాదు.
కరెంట్ లైన్ల క్రింద నిర్మాణాలు చేయరాదు.ఇంటి దగ్గర కరెంట్ వాడకానికి కోక్కాలు వాడరా దు; సర్వీస్ వైర్‌ను అధికారుల ద్వారా కనెక్ట్ చేయించుకోవాలి.
ట్రాన్స్ఫార్మర్ రిపేర్‌ను రైతులు స్వయంగా చేయరాదు అధికారులు వచ్చే వరకు వేచి ఉండాలి, మోటార్ సర్వీస్ వైర్లు కరెంట్ లైన్‌కు కనెక్ట్ చేసేటపుడు, మూడు వైర్లను ఒకే సమయంలో కలిపి, ఒక మీటర్ దూరంలో ముడివేయా లి విడిగా తగిలించరాదు. ప్రమాదం జరిగినప్పుడు చేయవలసినవి.ప్రమాదంలో ఉన్న మనిషి/జంతువు/వస్తువును నేరుగా తాకరాదు.
పొడి కర్ర, ప్లాస్టిక్ పైప్ లేదా ఇన్సులేటెడ్ వస్తువు ద్వారా మాత్రమే వేరు చేయాలి.
వెంటనే ఆసుపత్రికి తరలించి వైద్యం అందించాలి.
ఎలాంటి విద్యుత్ సమస్య లకైనా టోల్ ఫ్రీ నంబర్ 1912 కి సమాచారం ఇవ్వాలి.