
ఆర్టీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంటి ముదిరాజ్
హన్మకొండ:నేటిధాత్రి
హనుమకొండ జిల్లా విద్యార్థుల సమస్యల పైన హనుమకొండ జిల్లా డీఈఓ డా.అబ్దుల్ హై కు వినతి పత్రం అందించారు. ఆర్టీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంటి ముదిరాజ్ మాట్లాడుతూ ఇయర్ ఎండింగ్ పరీక్షల టైంలో విద్యార్థులను ఫీజుల పేరుతో ప్రవేట్ స్కూల్ యజమాన్యం రక్తం తాగుతున్నారు. ఫీజులు కట్టలేదని ఎండలో నిలబెడుతున్నారు. ప్రవేట్ స్కూల్ యజమాన్యం సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం విద్యను వ్యాపారం చేయొద్దన్న ప్రవేట్ విద్యాసంస్థలు ఆ ఉత్తర్వులను పెడచెవ్విన పెట్టి ట్యూషన్ ఫీజు, యూనిఫామ్ ఫీజు, డొనేషన్ ఫీజు, బుక్స్ ఫీజు, అని అధిక ఫీజులతో విద్యార్థులను వారి తల్లిదండ్రులను వేధిస్తున్నారు. టెట్టు క్వాలిఫై కానీ టీచర్లతో టీచింగ్ చేపిస్తున్నారు. వ్యాలిడిటీ అయిపోయినటువంటి స్కూల్ బస్సులు నడిపిస్తూ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటలాడుతున్నారు. ప్రైవేట్ స్కూల్ యజమాన్యం , విద్యార్థుల తల్లిదండ్రులు అప్పులు తెచ్చి ఆత్మహత్యలు చేసుకుని ఫీజులు కడుతుంటే ప్రభుత్వ నాయకులు స్పందిస్తలేరు. 2005లో హైకోర్టు ఫీజు నియంత్రణ చట్టం తీసుకొస్తే ఆ జీవోను అమల్లోకి తెస్తలేరు. ప్రభుత్వం వెంటనే ఫీజు నియంత్రణ చట్టం అమల్లోకి తేవాలి. ప్రవేట్ స్కూల్ లపై ఒక కమిటీ వేసి అధిక ఫీజులు వసూలు చేస్తున్నటువంటి విద్యాసంస్థల గుర్తింపు రద్దు చేయాలి.అధిక ఫీజులపై ఒక ట్రోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసి విద్యార్థులకు అందుబాటులో ఉంచాలి. విద్యార్థుల అన్ని సమస్యలు పరిష్కరించాలని కోరారు. దీనిపై అధికారులు స్పందిస్తూ వారం రోజుల్లో స్కూల్ లపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు స్రవంతి, భోగం సంధ్య,ముచ్చర్ల మల్లేష్ పాల్గొన్నారు.