డబ్బులు గోల్ మాల్ 

గగ్గోలు పెడుతున్న సబ్ కాంట్రాక్టర్లు

ఒక్కొక్కడిగా బయటపడుతున్న వైనం

శాయంపేట ఎంపీడీవో కార్యాలయం ఎదుట బాధితుల ఆందోళన

శాయంపేట నేటి ధాత్రి:

హనుమకొండ జిల్లా శాయంపేట మండలం ప్రగతి సింగారం గ్రామానికి చెందిన ఎంపీపీ మెతుకు తిరుపతిరెడ్డి కాంటాక్ట్ పనులు చేసే సర్టిఫికెట్ కలిగి ఉంది కొన్ని పనులు చేస్తూ నాకు సబ్ కాంట్రాక్టర్ పనులు ఇప్పిస్తామని నమ్మించి మాతో పని చేయించుకుని డబ్బులు ఇవ్వడం లేదు. వివరాలకు వెళితే కరువు సీతంరెడ్డి చిలుకల కొమురయ్య గాదం చిన్న కొమురయ్య అనే ముగ్గురు వ్యక్తులు సబ్ కాంట్రాక్టర్ గా పనిచేశాము. మిషన్ కాకతీయ ద్వారా శాయంపేట మండలం మైలారం గ్రామంలో నాగయ్య కుంట ఆరు సంవత్సరాల క్రితం 18 లక్షల పెట్టుబడి పెట్టాం. రాజుపేట రమణక్కపేట అక్కడ కూడా పనిచేశాం అవి కూడా రాలేదు. రామకృష్ణ ఏఈ కలిస్తే డబ్బులు ముట్టినవి అని చెప్పడం జరిగింది.ఇంతవరకు మాకు డబ్బులు ఇవ్వలేదు ముగ్గురికి కలిపి 28 లక్షలు రావాలి. అదేవిధంగా భద్రాచలం జిల్లా కొత్తగూడెం మండలం పాల్వంచ గ్రామంలో మిషన్ కాకతీయ మూడు చెరువుల పూడికలు 30 లక్షల సివిల్ కాంట్రాక్టర్ చేశాము మాకు ఇంతవరకు డబ్బులు ఇవ్వలేదు. స్థానిక మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, జ్యోతి దృష్టికి తీసుకెళ్లగా వారు ఎంపీపీని మందలించి డబ్బులు చెల్లించాలని ఆదేశించడం జరిగింది. అయినా డబ్బులు ఇవ్వడం లేదు. మెతుకు తిరుపతిరెడ్డిని ఎన్నిసార్లు కలిసిన రేపు మాపు కబుర్లు చెబుతున్నాడు. భూములు ఆస్తులు అమ్ముకొని తాము పెట్టుబడులు పెట్టామని ఆర్థిక సమస్య కుటుంబాలతో గొడవలు జరుగుతున్నాయని ఆత్మహత్యలు శరణ్య మైనప్పటికీ ఎంపీపీ స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు తమలాంటి బాధితులు ప్రకాష్ సింగారంలో ఎందరో ఉన్నారని తెలిపారు ఈ క్రమంలో ఎంపీడీవో కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించిన అనంతరం బాధితులు పోలీస్ స్టేషన్ లో ఎంపీపీ పై ఫిర్యాదు చేశారు ఈ ఆందోళనలో కర్ర సీతారాంరెడ్డి చిలుకల కొమురయ్య, గాదం చిన్న కోమరయ్య, చిలుకల రాజన్న, మోరే శ్రీనివాస్, ఎండి మైనోద్దీన్ , తాటి కంటి కుమారస్వామి, భయగాని సాంబలక్ష్మి, దేను వెంకట స్వామి బాలకృష్ణ, బైగాని సాంబలక్ష్మి  పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!