
హిందువుల నూతన సంవత్సరం జనవరి ఒకటి కాదు. ఉగాది. .
ఉగాది పచ్చడి తీసుకోవడం వల్ల ఆరోగ్యం.
ఓదెల చంద్రమౌళి సైన్స్ టీచర్.
చిట్యాల, నేటి ధాత్రి :
ఉగాది పండగ దాని ప్రాముఖ్యత దాని వెనుక ఉన్న సైన్స్ గురించి ఓదెల చంద్రమౌళి సైన్స్ టీచర్ నేటి ధాత్రితో పంచుకున్న విశేషాలు ప్రపంచంలో ఏ పండుగకి లేని విశిష్టత భారత దేశంలో జరిగే ప్రతి పండుగకి ఉంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు .భారతీయ పండుగలు పర్యావరణహితం కోసమే సమాజ శ్రేయస్సు కోసమే. అని.శతాయుష్యం వజ్రదేహం దదాత్యర్థం సుఖానిచ
సర్వారిష్టవినాశంచ నింబకందళ భక్షణమ్॥
ప్రపంచం మొత్తం నూతన సంవత్సరాన్ని జనవరి ఒకటో తేదీన ప్రారంభిస్తారు కానీ అది విజ్ఞానం కాదు. హిందూ క్యాలెండర్ ప్రకారం.
ఉగాదితో కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది సాధారణంగా ఉగాది చైత్ర శుద్ధ పాడ్యమి రోజున ప్రారంభమవుతుంది దీనికి కారణం చంద్రుని కక్షలో వచ్చే మార్పు మరియు సూర్యుడు భూమధ్య రేఖను దాటడం.
ఇది ఖగోళంలో జరిగే మార్పులు.సాధారణంగా ఈ మాసంలో కాల మార్పు వలన వర్షాకాలం నుండి వేసవికాలంలోకి ప్రవేశించడం వలన, విష జ్వరాలు ,అనుకొని ఆరోగ్య మార్పులు వేసవి తాపానికి శరీరం సర్దుకోకపోవడం ఇలాంటి ఎన్నో వ్యాధులతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ వ్యాధులను నయం చేసి సంవత్సరం పాటు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి మరియు ఇక ముందు వచ్చే ఎండ యొక్క తీవ్రతను తట్టుకునే విధంగా శరీరాన్ని సిద్ధం చేయడానికి ఆనాడు మన మేధావులు ఈ ఉగాది పండుగ రోజున పచ్చడి సేవించడం ద్వారా రోగనిరోధక శక్తి పెరుగుతుంది వ్యాధి లేని శరీరం మనకు లభిస్తుంది అని అన్నారు
ఉగాది పండుగ లో మనం ఉపయోగించే పచ్చడిలో ఆరు రకాల రుచులను కలిపి తయారుచేస్తారు.
1. కారం
2. తీపి
3. ఉప్పు
4. పులుపు
5. వగరు
6. చేదు
ఇలాంటి రుచులను కలిపి పచ్చడి తయారు చేస్తారు మామిడి కొత్త బెల్లం ,కొత్త చింతపండు ,నీళ్లు ,కారం, ఉప్పు ,వేప పువ్వు ,వేసి తయారుచేస్తారు ఈ పచ్చడిని సాధారణంగా 21 రోజులు ప్రతిరోజు తీసుకుంటే. ఆరోగ్యంగా ఉంటాము అనేది నిజం.
వేప పువ్వు మన శరీరం నుండి , వైరస్లను చంపుతుంది అదే విధంగా కొత్త బెల్లం కొత్త రక్త కణాలను కూడా ఉత్పత్తి చేయగలుగుతుంది. ఈ విధంగా ప్రతి పదార్థం కూడా శరీరానికి ఎంతో అవసరం దీని ద్వారా మనకు రోగ నిరోధక శక్తి పెరిగి సంవత్సరం పొడుగుతా వ్యాధులు లేని శరీరం మరియు ఈ వచ్చే అత్యధిక వేడి తీవ్రతను కూడా తట్టుకునే విధంగా సిద్ధం చేస్తుంది.
ఈ విధంగా ఉగాది పండుగ వెనుక ఎన్నో ఖగోళ రహస్యాలు మరియు ఎన్నో ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయి
ఇదే విధంగా భారతదేశంలో జరిగే ప్రతి పండుగలు కూడా ఎంతో సైన్స్ దాగి ఉంది భారతీయ పండుగ వైజ్ఞానిక దాయకం.మన పండుగలను అంతఃకరణ శుద్ధితో పాటిద్దాం ఆరోగ్యాన్ని పొందుదాం ఈ భూమిని మరికొన్ని సంవత్సరాలు బ్రతికిద్దాం.