శాయంపేటలోఅంగరంగ వైభవంగా గణేశుని నిమజ్జనం

బై….బై….గణేశా… గణనా థునికి ఆటపాటలతో వీడ్కోలు

శాయంపేట నేటిధాత్రి:

శాయంపేట మండల కేంద్రంలోని గణనాథులను గణపతి బప్పా మోరియా జై బోలో గణేష్ మహరాజ్ కి జై, గణపయ్యా ఇక సెలవు అంటూ భక్తి శ్రద్ధలతో ఆ ఆదిదేవుడు గణనాథునికి మండల ప్రజలు వీడ్కోలు పలికారు. గణేష్ మండపాల వద్ద తొమ్మిది రోజుల పాటు మండపాల్లో ప్రతిష్టించిన వినాయకులను అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు.ప్రజలు, భక్తులు పెద్ద ఎత్తున చేరుకొని వినాయ కులను ఆటపాటలతో తీర్థప్రసాదాలు స్వీకరించి, సాంప్రదాయ వస్త్రాధారణతో యువతి, యువకులు నృత్యాలు చేస్తూ, రంగులు చల్లుకుంటూ, కేరింతల కొడుతూ, భక్తిశ్రద్ధలతో గణనాధునికి సెలవు పలికారు. నిమజ్జన ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ట్రాక్టర్లను,లారీలను,ట్రాలీలను మామిడి తోరణాలతో ముస్తాబులు చేసి విఘ్నేశ్వరుని నిమజ్జనానికి తరలించారు. శాయంపేట ఎస్సై మాట్లాడు తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నియమ నిబంధన పాటించా లని పేర్కొన్నారు మండల కేంద్రంలోని చెరువుల వద్ద బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది చెరువుల వద్దకు గణనాథులను తీసుకువెళ్తున్న నేపథ్యంలో చిన్న పిల్లలను వెంట తీసుకెళ్లకూడదని, భక్తిశ్రద్ధలతో, నియమ నిబంధనలతో తరలివెళ్లాలని అన్నారు. గణనాథుని ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆ ఆది దేవుణ్ణి వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో మహిళలు, భక్తులు,ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *