తక్షణ సహాయక చర్యలు చేపట్టాలి

– బిఅరెస్ ప్రజాప్రతినిధులు, నాయకులకు మాజీ మంత్రి , ఎమ్మెల్యే హరీష్ రావు గారు ఆదేశం

– వడగళ్ల బీభత్సంపై ఢిల్లీ నుండి టెలీ కాన్ఫరెన్స్

– యుద్ధప్రాతిపదికన ప్రజల్లోకి వెళ్లాలని పిలుపు

– అకాల వర్షానికి నష్టపోయిన పంటకు ఎకరానికి 10 వేలు ఇచ్చి రైతులను ఆదుకోవాలి

– రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు గారు…

– రాళ్ళ వర్షం కు జరిగిన నష్టం ఫై తక్షణమే ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సంబంధిత వ్యవసాయ, విద్యుత్, ఉద్యాన వన శాఖ, మున్సిపల్ శాఖ క్షేత్ర స్థాయి లో పరిశీలించాలని కోరిన హరీష్ రావు గారు…

– ప్రజలకు అండగా ఉండండి.. అందుబాటులో ఉండండి…

– రైతుల వద్దకు వెళ్లి ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసం నింపండి…

– మున్సిపల్, రెవిన్యూ అధికారులతో మాట్లాడి తక్షణ సహాయం అందించాలి… పార్టీ నుండి సహాయం అందించి ప్రజలకు అండగా నిల్వండి..

– భారీ వర్షానికి కూలిన పాత ఇల్లను పరిశీలించి సహాయం అందించాలి…

– నష్టపోయిన పంటను పరిశీలించి వ్యవసాయ, ఉద్యాన వన శాఖ అధికారూలతో పరిశీలించాలి..

– రెవిన్యూ, వ్యవసాయ,ఉద్యాన వన శాఖ విద్యుత్, మున్సిపల్ అధికారులతో ఫోన్ లో మాట్లాడిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు గారు…

ఈ సందర్బంగా మాట్లాడుతూ…

– మంగళవారం సాయంత్రం రాళ్ల తో కురిసిన భారీ వర్షం కు సిద్దిపేట పట్టణం లో చెట్లు, పలు రోడ్లు.. అక్కడక్కడ విద్యుత్ స్థంబాలు వైర్లు కింద పడి పొయాయ్ అన్నారు..

– పట్టణం లో పాత ఇల్లు కూలి పోవడం గోడలు పడి పోవడం వలన ప్రజల తీవ్ర ఆందోళన లో ఉన్నారు..
– అలాంటి ప్రజలను ఈ సమయం లో ఆదుకోవాలి అండగా నిలవాలని మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్స్ లకు సూచించారు..
– వెంటనే మీ మీ వార్డుల్లో పర్యటించి గుర్తించాలన్నారు..
– పూర్తి గా ఇల్లు కూలి పోతే లక్ష రూపాయలు, పాక్షికంగా కూలితే ఆర్థిక సహాయం ప్రభుత్వం నుండి వస్తుంది.. అందుకు రెవెన్యూ అధికారులతో మాట్లాడి రికార్డ్ చేపించాలి..
– ఇళ్లు కూలి పోయి బయట ఉండే పరిస్థితి ఉన్న వారికి రెవిన్యూ, మున్సిపల్ లేక మన పార్టీ నుండి తక్షణ సహాయం చేపట్టి వార్డ్ లోని కమ్యూనిటీ హల్స్, నైట్ షెల్టర్ లలో ఉంచాలి వారికి భోజన ఏర్పాటు చేసి అండగా నిలవాలి…
– పట్టణం లో నాసర్ పురా, 18వ వార్డ్ లోని బుడగ జంగాల కాలనీ లో విద్యుత్ పోల్స్ పడి పొయాయ్… విద్యుత్ అధికారులను పంపించి చర్యలు చెపట్టాల్సిందిగా కోరారు..
– లింగారెడ్డి పల్లి వైపు 31 కొబ్బరి చెట్లు కింద పడి పొయాయ్ సిరిసిల్ల రోడ్డు వైపు చెట్లు విద్యుత్ స్థంబాలు పడి పోయి ప్రజలకు ఇబ్బందిగా మారాయ్…

– మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ కౌన్సిలర్స్ పట్టణం లో క్షేత్ర స్థాయి లో తిరిగి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలి…..
– రూరల్ మండలం లోని పుల్లూరు, వెంకటపూర్, బుసపూర్ తడకపల్లి, చిన్నకోడూరు మండలం లోని చంద్లపూర్, చౌడారం, నియోజకవర్గం లోని పలు గ్రామాల్లో వర్షం పడి పంట నష్టం జరిగింది..
– వెంటనే ప్రజాప్రతినిధులు వ్యవసాయ ఉద్యాన వన శాఖ అధికారులతో ఉదయాన్నే పరిశీలించండి…
– నష్టపోయిన పంటకు ఎకరానికి 10 వేలు ఇవ్వాలని డిమాండ్ చేయాలి రైతులని ప్రభుత్వం ఆడుకోవాలని చెప్పారు..
– నియోజకవర్గం లో అకాల వర్షానికి మామిడి, కొబ్బరి ఇతర తోటలు తీవ్ర నష్టం జరిగిందన్నారు… వేంటనే అధికారులు చర్యలు లు చేపట్టాలని రైతుల పక్షాన డిమాండ్ చేశారు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!