
leaders
మెడికల్ ల్యాబ్ యూనియన్‌కు ఐఎంఏ సంపూర్ణ మద్దతు
మంచిర్యాల,నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్స్ అసోసియేషన్ రి.నెం.374/2020 యూనియన్ వారు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్న సందర్భంగా మంచిర్యాల జిల్లా నాయకులు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) జిల్లా అధ్యక్షులు డాక్టర్ రమణ ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి శాలువాతో సత్కరించడం జరిగింది.ఈ సందర్భంగా వారు ఇటీవల ఎన్నుకున్నటువంటి తమ నూతన యూనియన్ గురించి ఆయనకు వివరించారు.డాక్టర్ రమణ స్పందిస్తూ ల్యాబ్ టెక్నీషియన్ల సమస్యలు మరియు వారి యూనియన్ అవశ్యకతను పూర్తిగా అర్థం చేసుకుని,వారికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు.వైద్య రంగానికి ల్యాబ్ టెక్నీషియన్లు అందిస్తున్న సేవలు ఎంతో విలువైనవి అని ఆయన ప్రశంసించారు.కొత్తగా ఏర్పడిన ఈ యూనియన్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తూ,నూతన యూనియన్ కార్యవర్గాన్ని శాలువాలతో సత్కరించి,తమ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని భరోసా ఇచ్చారు.అనంతరం మంచిర్యాల జిల్లా డ్రగ్గిస్ట్ కెమిస్ట్ జనరల్ సెక్రెటరీ టి.సుధాకర్ నీ కలిసి మాట్లాడటం జరిగింది.సానుకూలంగా స్పందించిన సెక్రటరీ సుధాకర్ ల్యాబ్ టెక్నీషియన్ల సంక్షేమం కోసం చేపట్టిన ప్రతి కార్యక్రమానికి తమ పూర్తి మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు.యూనియన్ అంతా కలిసికట్టుగా నడుస్తూ సమస్యలను పరిష్కరించుకునే విధంగా ముందుకు సాగాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మెడికల్ ల్యాబ్ అసోసియేషన్ అధ్యక్షుడు కందునూరి ప్రశాంత్,ఉపాధ్యక్షులు చంద్రమౌళి,ఇర్షాద్,ప్రధాన కార్యదర్శి కాజా పాషా,ట్రెజరర్ కామని శ్రీనివాస్,సంయుక్త కార్యదర్శి శైబజ్,పలువురు ల్యాబ్ టెక్నషియన్లు పాల్గొన్నారు.