
ఆ మూవీ సీక్వెల్ చేయడానికి నేను రెడీ..
అలనాటి హీరోయిన్ జెనీలియా (Genelia) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ‘బొమ్మరిల్లు’ (Bommarillu) సినిమాలో హాసిని క్యారెక్టర్‌తో ఈ ముద్దుగుమ్మ క్రేజ్ ఏ స్థాయికి చేరుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమా తర్వాత వరుస విజయాలతో టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ రేంజికి ఎదిగింది. ఇక కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉండగానే బాలీవుడ్ నటుడు రితేష్ దేశముఖ్ (Rithesh Deshmukh)ని పెళ్లి చేసుకుని సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. ప్రస్తుతం ఇద్దరు పిల్లల తల్లైన జెనీలియా, మళ్లీ వెండితెరపైకి రీ ఎంట్రీ ఇచ్చింది.13 ఏళ్ల విరామం తర్వాత ‘జూనియర్’ (Junior) మూవీతో రీ ఎంట్రీ ఇచ్చింది జెనీలియా. ఈ క్రమంలో పలు విషయాలు షేర్ చేస్తుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జెనీలియాను యాంకర్ సుమ సిద్ధార్థ్ అండ్ జెనీలియా ఉన్న ఫొటోను చూపించింది.
ఇక అది చూసిన ఈ చిన్నది వావ్ బొమ్మరిల్లు టైంలో తీసుకున్న ఫొటో ఇది. నేను రీసెంట్గా ఈ మూవీ రీరిలీజ్ అయినప్పుడు అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉండే అందుకే రాలేకపోయాను. అయితే నేను మళ్ళీ బొమ్మరిల్లు-2 చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని అంటుంది. అప్పుడు యాంకర్ సుమ మేము కూడా అదే కోరుకుంటున్నాము. సీరియస్‌గా చెప్పాలంటే మీకు మ్యారేజ్ అయి ఇద్దరు పిల్లలు ఉన్నా కానీ ఏమీ చేంజ్ కాలేదు. ఇప్పుడు కూడా నిన్ను హాసినిలా దించేయవచ్చు అని పొగడ్తలతో ముంచేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది .