Candidate Seeks One Chance to Develop the Village
మీ ఇంటిలో ఓ మనుషులా అడుగుతున్నా.
ఒక్క అవకాశం ఇవ్వండి.
నిజాంపేట: నేటి ధాత్రి
ఒక్క అవకాశం ఇస్తే.. మీ ఇంటిలో ఓ మనిషిలా గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని నాతి అంజమ్మ లక్ష్మా గౌడ్ అన్నారు. నిజాంపేట మండలం నస్కల్ గ్రామానికి చెందిన నాతి అంజమ్మ లక్ష్మా గౌడ్ గ్రామపంచాయతీ ఎన్నికలలో భాగంగా సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామస్తులు సహకారం అందిస్తే.. గ్రామ అభివృద్ధిని చూపిస్తానన్నారు. గ్రామంలో ఇంటింటికి వెళ్లి వారు సమస్యలు తెలుసుకుని తప్పకుండా పరిష్కరించుతానని హామీ ఇచ్చారు. ప్రభుత్వం నుండి వచ్చే ప్రతి పథకాన్ని ప్రజలకు చేరవేస్తానన్నారు. గ్రామంలో బస్సు సమస్యను పై అధికారుల దృష్టికి తీసుకువెళ్లి బస్సులో రాకపోకలకు కృషి చేస్తానన్నారు. మండలంలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతున్నారు. మీ అమూల్యమైన ఓటును ఉంగరం గుర్తుపై వేసి వారి మెజార్టీతో గెలిపించాలని వేడుకున్నారు.
