https://epaper.netidhatri.com/view/487/netidhathri-e-paper-19th-jan-2025/2
`చిత్రపురిలో వెలుగులోకి వస్తున్న భయంకర నిజాలు.
`రో హౌస్ లలో నివాసముండేది కేవలం పదుల కుటుంబాలు.
`వాటిని గెస్ట్ హౌస్ లుగా మార్చుకున్న వారే అందరూ.
`అక్రమ కార్యకలాపాలకు రో హౌస్‌లు అడ్డాలు.
`గుట్టు చప్పుడు కాకుండా నీతి మాలిన పనులు.
`సాయంత్రం వేళల్లో అనైతిక కార్యకలాపాలు.
`ఎవరికీ అనుమానం రాకుండా రో హౌస్ లు ఎంచుకున్నారు.
`రో హౌస్‌లు విలాసాలకు అడ్డాలుగా మార్చుకున్నారు.
`పైకి మాత్రం అందరూ పెద్ద మనుషులు.
`సినిమా వాళ్లంటే ఎవరికీ అనుమానాలు రావు.
`సినిమా వ్యవహారాలని ఎవరూ పట్టించుకోరు.
`పైకి కనిపించేదంతా సినీ గద్దల సమావేశాలు.
`లోపల జరిగేదంతా గుడిసేటి వేషాలు.
`అన్ని తెలిసినా కార్మికులు ప్రశ్నించలేదు.
`సినిమా వాళ్ల వ్యవహారమని ఎవరూ కలుగజేసుకోరు.
`సినిమా వాళ్లకు అదంతా కామన్ అనుకుంటారు.
`అందుకే సినీ గద్దలు నీచాలకు దిగజారుతున్నారు.
`నివాసాల కోసమని చెప్పి విలాసాలు సాగిస్తున్నారు.
`అనైతిక కార్యకలాపాలకు అడ్డాలు చేసుకోవడం దుర్మార్గం.
`సినీ గద్దలు ఎంచుకున్న సురక్షిత ప్రాంతం.
`విందులు, వినోదాలకు అనువైన స్థలం.
`తమ సరదాల కోట్ల రూపాయల విలువైన భూమిని కొట్టేశారు.
`విలాసవంతమైన భవనాలు కట్టేశారు.
`కార్మికులకు నిలువ నీడ లేకుండా చేశారు.
`తాము మాత్రం తందనాలడడానికి స్థలాలు కొట్టేశారు.
`ఆడిషన్ల ముసుగులో అడ్డమైన పనులు చేస్తున్నారు.
`సొంత ఇండ్లను సరదా సోకుల కోసం వినియోగించుకుంటున్నారు.
`ఎక్కడ కనిపించినా మీడియాలో వార్తలకెక్కుతారు.
`రో హౌస్ లలో రంకులెన్ని చేసినా ఎవరూ పట్టించుకోరు.
`నిత్యం రో హౌస్ లలో జరిగే తంతు మొత్తం ఇదే…
`నిజంగా అక్కడ జరిగేది సినీ హడావుడి నిజమైతే ఏడాదికి వెయ్యి సినిమాలు రావాలి.
`రో హౌస్‌లున్న పెద్దలవి ఏళ్లు గడిచినా ఒక్క సినిమా రావడం లేదు.
`మతలబ్ క్యాహై…కుచ్ కుచ్ హోతా హై!!
నిజాలు నిష్టూరంగానే వుంటాయి. కాని నిజాలే వ్యక్తిని, వ్యవస్దను, సమాజాన్ని నిలబెడతాయి. నడిపిస్తాయి. నిజమే అన్నింటినీ శాసిస్తుంది. నిజాన్ని వినేందుకు, జీర్ణించుకునేందుకు చాల మంది ఇష్టపడరు. అబద్దాలతో, అన్యాయాలతో బతికేవాళ్లకు నిజం గిట్టదు. అలాంటిదే చిత్రపురిలోని రోహౌస్పై వెలుగులు చూస్తున్న నిజాలు. చిత్రపురిలో సినీ గద్దలు రోహజ్లు ఎందుకు నిర్మాణం చేసుకున్నారు? ఇది మొదటి ప్రశ్న. రోహౌజ్‌లు తీసుకున్న ప్రతి సినీ పెద్దకు అక్కడే కాకుండా అనేక ఇండ్లున్నాయి. నివాసం వుండేందుకు ప్రత్యేకంగా భవంతులున్నాయి. నగరశివారుల్లో ఫామ్ హౌజ్‌లు కూడా వున్నాయి. అయినా చిత్రపురిలో కూడా పెద్దలందరికీ రోహౌజ్‌లు చాలా మందికి వున్నాయి. రోహౌజ్‌లు నిర్మాణం చేసుకున్న వాళ్లలో అతి కొద్ది మాత్రమే అక్కడ నివాసాలుంటున్నారు. అంటే వాళ్లకు ఇతర ప్రాంతాల్లో ఇల్లు లేకపోవడంతో మాత్రమే వుంటున్నారు. కాని మిగతా పెద్దలెవరు? అక్కడ వుండడం లేదు. వుండరు కూడా? కాని వారికి రో హౌజ్‌లు ఎందుకు? కాని రో హౌజ్‌లు ఉదయం వేళ్లలో తాళాలుంటాయి. సాయంత్రం వేళల్లో బల్బులు వెలుగుతుంటాయి ఎందుకు? పొద్దంతా సినిమా షూటింగులు జరిపి సాయంత్రం వచ్చి నిత్యం అర్ధరాత్రుల దాకా దర్శకులు, నిర్మాతలు చేసేదేమీ వుండదు. పొద్దంతా అలసిపోయిన వాళ్లు సాయంత్రాలు ఇళ్లకు చేరుకుంటారే తప్ప రోహౌజ్‌లకు రారు. అసలు రోహౌజ్‌లకు నిర్మాణం చేసుకున్న సినీ పెద్దల కుటుంబాలు అక్కడకు రావు. వచ్చినట్లు కూడా దాఖలాలు లేవు. కాని రోహౌజ్‌లు నిర్మానం చేసుకున్నారు. కార్మికుల పొట్ట కొట్టారు. రోహౌజ్లున్న వాళ్లు ఎవరికైనా అద్దెలకు ఇచ్చారా? అంటే అదీ లేదు. మరి ఆ రోహౌజ్‌లను ఎందుకు వాడుకుంటున్నారు? అక్కడ సినిమా కార్యాలయాల బోర్డులు లేవు. ఎందుకంటే అవి ఆవాసాల కోసం నిర్మాణం చేసుకున్న ఇండ్లు. మరి రో హౌజ్‌లు ఇంకెందుకు ఉపయోగపడుతున్నాయన్న ప్రశ్న అందరికీవుంది. కాని ఎవరూ బైట పడరు. కాని అందరికీ తెలుసు. రోహౌజ్‌లలో ఏఏ బాగోతాలు జరుగుతున్నాయో? జరుగుతాయో? తెలియిన వాళ్లు ఎవరూ లేరు. కాని అందరూ సినిమాలో నటించినట్లే నటిస్తున్నారు. ఏమీ తెలియని అమాయకులుగా కనిపిస్తున్నారు. కళ నుంచి కామ కళకు సినిమా ఎప్పుడో మారిపోయింది. అప్పటి నుంచే ఈ దరిద్రమంతా వచ్చి చేరింది. సినిమా పెద్దలుగా చెలమాణి అయిన వారు కొంత మంది బలవంతులు రో హౌజ్‌లు తీసుకున్నారు. అక్కడ సినిమాలకు సంబంధించిన ఎలాంటి సమావేశాలు వుండవు. కనీసం దర్శకులకు చెందిన అసిస్టెంట్లు వుండరు. రచయితలకు చెందిన అసిస్టెంట్లు వుండరు. మరి వాటిని ఏం చేస్తున్నట్లు ? ఎందుకు వినియోగిస్తున్నట్లు? అక్కడ సాగుతున్న అనైతిక కార్యకలాపాలపై అందరికీ తెలుసు. కాని ఎవరూ పట్టించుకోరు. ఎందుకంటే అవి వాళ్ల సొంత ఇండ్లు. అక్కడ ఏం జరిగినా ఎవరూ పట్టించుకోరు. ఆ ధైర్యంతోనే సినీ పెద్దలు విలాసాలకు ఆ రోహౌజ్‌లను వినియోగించుకుంటున్నారు. సినిమా వాళ్లు బైటకు వెళ్తే ఏదో రకంగా మీడియాకు ఎక్కుతారు. సినిమా కోసం వచ్చే అమ్మాయిలు వాటిని ఆసరగా తీసుకొని నిర్మాతలను, దర్శకులపై ఆరోపణలు చేస్తున్నారు. తమను అటూ, ఇటు తిప్పుకున్నారని చెప్పడానికి అవకాశాలుగా మల్చుకుంటున్నారు. అందుకే చాల తెలివిగా సినీ పెద్దలు రోహౌజ్‌లను ఓయో రూములుగా మల్చుకున్నారు. విలాసాలకు కేంద్రాలు చేసుకున్నారు. ఇక్కడ విషయమేమిటంటే ఆ రోహౌజ్లున్న దర్శకులుగాని,నిర్మాతలు గాని ఇప్పుడు ఎవరూ సినిమాలు తీయడం లేదు. సినిమాలు కొనడం లేదు. కాని వాళ్లంతా సినిమా పెద్దలు. ఏటా ఓ వంద సినిమాలు నిర్మాణం జరిగితే అందులో ఓ పది సినిమాలు మాత్రమే పెద్ద సినిమాలు విడుదలౌతున్నాయి. ఆ పది సినిమాలలో కూడా ఈ సినీ పెద్దల సినిమా ఒక్కటి వుండదు. ఆ సినిమాలకు దర్శకత్వం వహించేవారు ఎవరూ వుండరు. కాని నిత్యం రోహౌజ్‌లకు ఎవరో వస్తుంటారు. వేళా పాళా లేకుండా వస్తుంటారు పోతుంటారు. ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే ఆ రోహౌజ్‌లకు వచ్చేవారు ఆ నిర్మాతలు కాదు. ఆ దర్శకులు కాదు. ఇతర సాంకేతిక నిపుణులెవరూ కాదు. సంగీత దర్శకులు కాదు. పాటల రచయితలు కాదు. గాయకులు కూడా కాదు. మరి ఎవరు వస్తున్నారు? ఎందుకు వస్తున్నారు? అన్నది కూడా ఎవరికీ తెలియదు. సహజంగా గేటెడ్ కమ్యూనిటీలలోకి ఎవరు పడితే వారు రారు. రాలేదు. కాని ఎవరెవరో వస్తున్నారు. అంటే ఆ సినీ పెద్దలకు సంబంధించిన వారు మాత్రమే రాగలరు. అక్కడ ఏమైనా సినిమా సిట్టింగులు జరుగుతున్నాయా? అంటే అదీ లేదు. అక్కడ సినిమాలకు సంబంధించిన కథా చర్చలు జరిగినట్లుగాని, జరుగుతున్నట్లు గాని కనిపించదు. ఇక అక్కడ ఏమైనా ఆడిషన్లు జరిగే అవకాశం వుందా? అందుకు సరిపోయే వసతులు అక్కడ వుండే అవకాశం లేదు. సహజంగా సినిమాలకు సంబందించి ఆడిషన్లన్నీ స్టూడియోలలోనే జరుగుతుంటాయి. దాంతో రోహౌజ్‌లను సినిమా అవసరాలకు కూడ వినియోగిస్తున్నట్లు ఎక్కడా సమాచారం లేదు. మొత్తంగా చిత్రపురిలో వున్న రోహౌజ్‌లలో అసాంఫీుక కార్యకలాపాలు గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్నాయన్నది వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల ఓ ఆరు రోహౌజ్‌లను కూల్చేయాలని అధికారులు నోటీసులు జారీ చేసి, నాలుగు కూల్చేశారు. ఆ రోహౌజ్‌లు కూల్చేస్తున్న సమయంలో అక్కడ డ్రగ్స్‌కు సంబంధించిన కొన్ని ఆనవాళ్లు దొరికినట్లు, వాటిని గుట్టు చప్పుడు కాకుండా కాల్చేసినట్లు కూడా తెలుస్తోంది. అంటే రోహౌజ్‌లలో జరగకూడని దరిద్రాలన్నీ జరుగుతున్నట్లు ఈ సంఘటన ద్వారా అర్దమౌతోంది. సినిమా నిర్మాణానికి చెందిన వాళ్లు పెద్దగా వుండకపోవడం, కొన్ని రోహౌజ్‌లు కిరాయిలకు ఇవ్వడం కూడా జరిగింది. వాటిలో ఎవరు వుంటున్నారన్నది కూడా ఎవరికీ తెలియదు. ఈ విషయాలు కార్మికులందిరికీ తెలుసు. కాని ఏమీ చేయలేని పరిస్తితి. ఎవరికీ చెప్పుకోలేని నిస్సహాయ స్ధితి. కార్మికులకు సంబందించిన భూములను ఆక్రమించి పెద్దలుగా చేలామణి అవుతున్న వారు గద్దలై వాలి, రోహౌజ్‌లు నిర్మాణాలు చేసుకున్నారు. వారి సరసల్లాప కార్యకలాపాలకు వేధికలు చేసుకుంటున్నారు. ఇక్కడైతే ఎవరికీ అనుమానం రాదు. ఎవరు అనుమానించే పరిస్దితి అసలేవుండదు. ఎవరొస్తున్నారు..ఎవరు వెళ్తున్నారని ఎవరూ ఆరా తీయరు. ఒక వేళ ఎవరైనా అడిగితే సినిమాకు సంబంధించిన విషయాలని అంటారు. కామసూత్ర సినిమా తీసేవారు కళాత్మకంగా తీస్తే ఎవరు చూస్తారు? అన్నట్లు సినిమాలలో నీతులు చెప్పేవారంతా ఇలా నీతి మాలిన పనులే చేస్తారని చెప్పడానికి రోహౌజ్‌లలో జరుగుతున్న బాగోతాలే నిదర్శనమని అంటున్నారు. ఇప్పుడు సినిమాలు తీసేవారులేరు. సినిమాలలో ఇతరులకు అవకాశాలిచ్చే పరిస్దితుల్లో లేరు. కొత్త వాళ్లు ఔత్సాహికులు సినిమా తీస్తే ధియేటర్లు గుప్పిట్లో పెట్టుకొని ఆ సినిమాలను తమ సినిమాలగా చెప్పుకొని పెద్దలుగా చెలామణి అవుతున్న వారే చిత్రపురిలో పాతుకుపోయారు. సినిమాలలో సంపాదించాల్సినంత సంపాదించారు. కార్మికుల భూములను కొల్లగొట్టారు. విలాసాల కోసం రోహౌజ్‌లు నిర్మాణం చేసుకున్నారు. అక్కడ వేయాల్సిన అడ్డమైన వేషాలు వేస్తున్నారని సమాచారం. చిత్రపురి అనేది ఒక పవిత్రమైన స్దలంగా చూసుకోవాలి. ఎందుకంటే నివాసాలు ఎప్పుడూ అనైతిక కార్యకలాపాలకే అడ్డాలు కాకూడదు. సినిమా పరంగా అక్కడ ఏవైనా గొప్ప కార్యాకలాపాలు జరిగినట్లు, జరుగుతున్నట్లు గాని ఇప్పటి వరకు లేదు. అయినా నివాసాల సముదాయాలలో కార్యాలయాలు ఏర్పాటు చేసుకుంటే గుట్టు చప్పుడు కాకుండా, ఇతరలకు ఇబ్బందులు కాకుండా మసలు కుంటారు. కాని చిత్రపురిలో ఏం జరిగినా ఎవరూ అడిగేవారు వుండదు. అటు వైపు తొంగి చూసే వారు కూడా వుండరు. రోహౌజ్‌లలో వినోదాలు జరుగుతున్నా సినిమా వాళ్లంటేనే వినోదం…వారు చేసేదే సల్లాపం అనుకుంటారు. అందుకే చిత్రపురిలో సినీ గద్దలు ఆడిరది ఆట…పాడిరది పాట అవుతుందంటున్నారు. అదికారులు దృష్టిపెడితే అందరి ముసుగులు తొలగిపోతాయంటున్నారు.