రోడ్లన్నీ అధ్వానం……!
పల్లెలకు వెళ్లేదెలా..?, ప్రయాణికుల అవస్థలు ఏళ్లుగా మరమ్మతులకు నోచుకోని రహదారులు
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం: దేశ అభివృద్ధికి పల్లెటూళ్లు పట్టు కొమ్మలాంటివి. కానీ, ఆ పల్లెలకు వెళ్లే రహదారులు అధ్వానంగా తయారై, ప్రజలకు నరకయాతన చూపి స్తున్నాయి. సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం మీదుగా జహీరాబాద్ నుంచి రాయికోడ్, పట్ పల్లి, రేగోడు, మనూర్, మండలాలకు వెళ్లే రహదారి పై అక్కడక్కడ ప్రమాదకర గుంతలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం వర్గాకాలం కావడంతో భారీ వర్షాలకు గుంతల్లో నీరు నిండడంతో ప్రమాదాలు జరుగుతు న్నాయి. కోహర్ మండలం దిగ్వాల్ నుంచి ఈదుల పల్లి, మేదపల్లి, మీదుగా ఝరాసంగం వెళ్లే రహదారి ధ్వంసమై రాకపోకలు సాగించే ప్రయాణికులకు ఇబ్బందిక రంగా మారింది. వాహనదా రుకు వర్గానికి గుంతలు తెలి యకపోవడంతో కింద పడిపోతున్నారు. ఝరాసంగం నుంచి సిద్ధాపూర్, చిలేపల్లి, చిలేపల్లి తండా మీదుగా న్యాల్ కల్ కు వెళ్లే రోడ్డుపై ప్రమాద కర గుంతలు ఏర్పడి వాహనదారులు అవస్థలు పడు తున్నారు. బొజనాయక్ తండా పంచాయతీ పరిధి లోని మూడు తండాలకు రోడ్డు సౌకర్యం లేక ప్రస వానికి ఉన్న మహిళలు, వృద్ధులు, విద్యార్థులు ఆ ను పత్రికి తరలించడంలో తండా ప్రజలు నానా అవస్థ లకు గురవుతున్నారు. ఝరాసంగం నుంచి బొపన్ పల్లి, బోడగామా, జీర్ణపల్లి, చిలేమామిడి, గ్రామాలల మీదుగా కోహిర్ క్రాస్ రోడ్, మునిపల్లి మండలం పెద్ద చేల్కెడకు వెళ్లే రోడ్డు ధ్వంసం అయింది. ఆయా ముండలాల ప్రజలు ఝరాసంగం మండలానికి తరచుగా రాకపోకలు కొనసాగిస్తుంటారు. మాచునూర్ నుంచి బర్జిపూర్ వెళ్లే మూడు కిలోమీ టర్ల దూరం పొడవునా ప్రమాదకర గుంతలు ఏర్పడ్డాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డు మరమతులను తక్షణమే చేపట్టాలని ఆయా మండలాలకు చెందిన ప్రజలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.