Illegal Constructions Rise Rapidly in Narsampet
నర్సంపేట నడిబొడ్డున అక్రమ కట్టడాలు
మద్యం దుకాణాల కోసం రోజుల వ్యవధిలోనే కట్టడాలు పూర్తి?
చోద్యం చూస్తున్న మున్సిపాలిటీ అధికారులు
కిందిస్థాయి అధికారుల కనుసనల్లో అక్రమ కట్టడాలు
నర్సంపేట,నేటిధాత్రి:
నర్సంపేట పట్టణంలో మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్యం ఒక వైపు ఉంటే కిందిస్థాయి అధికార సిబ్బంది సహకారంతో అక్రమ కట్టడాలు రోజుల వ్యవధిలోని పూర్తవుతున్నాయి. అయితే ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా కొత్త మద్యం దుకాణాలు ఈనెల 1 నుండి కొలువుదీరగా నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో టెండర్లు దక్కించుకున్న మద్యం వ్యాపారులు కొత్త దుకాణాలు నూతన భవనాల్లో ఓపెన్ చేసేందుకు మున్సిపల్ శాఖ నుండి ఏలాంటి అనుమతులు తీసుకోకుండానే రోజుల వ్యవధిలోనే నిర్మాణాలు పూర్తి చేస్తున్నారు. నర్సంపేట పట్టణంలోని రాంరాజ్ థియేటర్ గల కాళీ స్థలంలో భారీ అక్రమ కట్టడ నిర్మాణాలను పూర్తి చేస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు. అలాగే వరంగల్ రోడ్డు లో గల ఒక పెట్రోల్ బంకు పక్కన ఉన్న ఖాళీ స్థలంలో 15 రోజుల్లోనే మున్సిపాలిటీ నుండి ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని ఆరోపిస్తున్నారు. అలాగే మున్సిపాలిటీ పరిధిలోని మహేశ్వరం శివారులో నర్సంపేట వరంగల్ ప్రధాన రహదారికి అనుకొని ఉన్న ఓ పెట్రోల్ బంకు ప్రక్కన గల ఒక వ్యవసాయ భూమిలో పత్తి చేనును తొలగించి నాలా కన్వెన్షన్ చేయకుండా అలాగే మున్సిపాలిటి నుండి ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణాలు చేపట్టి ఏకంగా మధ్యన దుకాణాన్ని ప్రారంభించారని ఆరోపణలు వెలివేస్తున్నాయి. పేదవాళ్లు చిన్నపాటి గోడ నిర్మించాలంటేనే మున్సిపాలిటీ అధికారుల పర్మిషన్ లేకుండా ఇటుక పెడ్డ వరుస కూడా పెట్టనివ్వని పరిస్థితుల్లో రోజుల వ్యవధిలోని అక్రమ నిర్మాణాలు పూర్తవుతుండనపై మున్సిపాలిటీ అధికారులపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ అక్రమ నిర్మాణాల పట్ల మున్సిపాలిటీలో పనిచేసే కిందిస్థాయి సిబ్బంది అధికారుల కనుసనల్లోనే ఈ అక్రమ కట్టడాల వ్యవహారాలు నడుస్తున్నాయని విశ్వసనీయ సమాచారం. నర్సంపేట మున్సిపల్ కమిషనర్ కాటా భాస్కర్ ను వివరణ కోరగా వాటికి పర్మిషన్లు ఉన్నాయో లేవో నాకు తెలవదు నేను తెలుసుకొని మీకు చెప్తాను. ఇప్పుడు వాటిని వాటి గురించి మాట్లాడే పరిస్థితి కూడా లేదు ఎందుకనగా సీఎం ప్రోగ్రాం ఉన్నందున మేము బాగా బిజీగా ఉన్నాము అని వివరణ ఇచ్చారు.
