Illegal Excavation Busted, Vehicles Seized
అక్రమ మట్టి తవ్వకం అడ్డుకట్ట – జేసీబీ,6 ట్రాక్టర్లు సీజ్
ప్రభుత్వ భూమిలో అనుమతి లేకుండా మట్టి తరలింపు
ఏడుగురు నిందితులపై కేసు నమోదు – డ్రైవర్లు అదుపులో
నర్సంపేట/గీసుగొండ,నేటిధాత్రి:
అక్రమ మట్టి తవ్వకాలపై అడ్డుకట్ట వేస్తున్నట్లు గీసుగొండ ఇన్స్పెక్టర్ డి. విశ్వేశ్వర్ తెలిపారు.గీసుగొండ మండలం చంద్రయ్యపల్లి గ్రామ శివారులోని ప్రభుత్వ భూమిలో అక్రమంగా మట్టితవ్వి తరలిస్తున్న వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నట్లు చెప్పారు.

ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండా జేసీబీ సహాయంతో మట్టి తవ్వి ట్రాక్టర్ల ద్వారా తరలిస్తుండగా పోలీసులు దాడి చేసి ఒక జేసీబీ, ఆరు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నామన్నారు.ఈ ఘటనలో సంబంధిత డ్రైవర్లు మరియు బాధ్యులపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, అక్రమ మట్టి తవ్వకం చేస్తున్న ఏడుగురు నిందితులను గుర్తించమని తెలిపారు.నిందితులల్లో గండికోట సతీష్, గాడుదుల రాజకుమార్, గాడుదుల శ్రావన్ కుమార్, కుప్పాల శ్రీనివాస్, కుప్పాల అజయ్, తోట పరుషరములు, గాడుదుల బాలారాజు లను అదుపులోకి తీసుకున్నట్లు ఈ మేరకు గీసుగొండ ఇన్స్పెక్టర్ డి. విశ్వేశ్వర్ తెలిపారు.
