కాంట బిల్లు చేయకుండానే లారీల రవాణా .
లోడింగ్ వద్ద వసూళ్ల పర్వం.
క్వారీ యజమానుల ఇష్ట రాజ్యం,
ఇసుక క్వారీ వద్ద ఏటు చూసిన నోట్ల కట్టల దర్శనం.
ప్రశ్నించే వారిపై దాడి కొరకు ప్రైవేటు వ్యక్తులకు ఏర్పాటు చేసిన యజమాన్యం.
మహదేవపూర్- నేటి ధాత్రి:
బొమ్మపూర్ ఎలికేశ్వరం పేరుతో నిర్వహిస్తున్న రెండు ఇసుక వారిలో అక్రమ ఇసుక రవాణా నేటికీ ఆగలేదు, టి ఎస్ ఎం డి సి ఉన్నత అధికారులు సందర్శించిన లెక్క చేయకుండా,బొమ్మ పూర్ ఎల్కేశ్వరం క్వారీలు ఇసుక అక్రమ రవాణా, అడ్డగోలు వసూళ్ల పర్వాన్ని దర్జాగా కొనసాగిస్తున్నాయి, ప్రస్తుతం ఇసుక క్వారీ వద్ద లోడింగ్ కొరకు 200 రూపాయలు, టిఎస్ఎండిసి, సీరియల్ తో పాటు బేబీ వద్ద రెండు వందల రూపాయలు, వసూలు చేయడం జరుగుతుంది. ఇసుక అక్రమ విషయంలో లోడింగ్ అనంతరం ఎలాంటి కాంటా పైనుండి లారీలు తీసుకువెళ్తే సరిపోతుంది. లారీలో ఎంత ఇసుక లోడింగ్ చేశారు అవసరం లేదు, వి బిల్ 200 ఇస్తే సరిపోతుంది. ప్రస్తుతం ఎలికేశ్వరం బొమ్మపూర్ 2 క్వారీల వద్ద టీఎస్ ఎంబీసీ తోపాటు క్వారీ యజమాన్యం సూపర్వైజర్లు లారీ వద్ద నుండి 6 నుండి 800 రూపాయల వరకు, వసూలు చేయడం జరుగుతుంది, మరోవైపు అదనపు బకెట్ అక్రమ ఇసుక రవాణా, పెద్ద మొత్తంలో కొనసాగడం జరుగుతుందని స్పష్టమవుతుంది.
తాజాగా ఇసుక క్వారీల యజమాన్యం, బయటి వ్యక్తులకు ప్రశ్నించకుండా ప్రైవేట్ వ్యక్తులను దాడుల కొరకు ఏర్పాటు చేశారు, లోడింగ్ వద్ద టీఎస్ఎండిసి అధికారులు ఎవరూ లేకుండా లారీల్లో ఇసుక లోడింగ్ ప్రక్రియను కొనసాగించడం జరుగుతుంది. ప్రస్తుతం ఈ రెండు ఇసుక క్వారీల్లో, లోడింగ్ నుండి మొదలుకొని ఎక్కడ చూసినా, నోట్ల కట్టలు దర్శనమిస్తున్నాయి. సుమారు ప్రతిరోజు ఈ రెండు ఇసుక క్వారీలకు 220నుండి 250 వరకు ఇసుక లారీలు ఇసుక నింపుకొనుటకు పెద్ద మొత్తంలో రావడంతో, అక్రమ వసూళ్లు ,అక్రమ ఇసుక రవాణాకు, బొమ్మపూర్, ఎలేకేశ్వరం, పేరుతో నిర్వహించబడుతున్న ఈ రెండు ఇసుక క్వారీలు పెద్ద మొత్తంలో సొమ్ము చేసుకుంటుంది.టీఎస్ఎండిసి అధికారి ఈ రెండు ఇసుక క్వారీల పై కన్నెత్తి చూడకపోవడం, టీఎస్ఎండిసి మేనేజింగ్ డైరెక్టర్ తోపాటు ప్రిన్సిపల్ సెక్రటరీ, ప్రభుత్వ ఆదేశాలు డొంట్ కేర్ అంటూ యజమాన్యం అక్రమ దందాను మూడు పూలు ఆరు కాయలుగా కొనసాగిస్తుంది.