అక్రమ రేషన్ బియ్యం దందా అరికట్టాలి.
రైస్ మిల్లర్లపై తనిఖీలు నిర్వహించాలి
తాసిల్దార్ కు వినతి
పత్రం అందజేత
చిట్యాల,నేటిధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోకొంతమంది రేషన్ డీలర్లు రేషన్ లబ్ధిదారుల నుండి అక్రమంగా రేషన్ బియ్యాన్ని కొంటూ సొమ్ము చేసుకుంటున్నారని జూకల్ మరియు మండలంలోని రైస్ మిల్లర్లపై తనిఖీలు నిర్వహించాలని మండల రెవెన్యూ వ్యవస్థను కోరుచున్నాము
పై విషయాలపై మంగళవారం రోజున మండల తహసిల్దార్ కార్యాలయంలోని ఎంపీఎస్ఓ కు వినతి పత్రం అందజేయడం జరిగింది. అనంతరం సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కార్యదర్శి మారపల్లి మల్లేష్
మాట్లాడుతూ కొంతమంది రేషన్ డీలర్లు లబ్ధిదారుల నుండి కేజీకి 7నుండీ 10 రూపాయలకు రేషన్ బియ్యాన్ని కొంటూ వాటిని మధ్య దళారీలకు ఎక్కువ రేటుకి అమ్ముకుంటూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపిస్తున్నాం. అదేవిధంగా మండలంలోని రైస్ మిల్లర్లు పిడిఎస్ దొడ్డు బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి సన్నబియంగా మార్చి గ్రామాలలోని కిరాణాలలో ఎక్కువ రేటుకు అమ్ముకుంటూ ప్రజలను దోపిడీ చేస్తున్నారని ఆరోపిస్తున్నాం.
పై విషయాలన్నిటిపై మండల రెవెన్యూ అధికారులు జిల్లా కలెక్టర్ స్పందించి తనిఖీలు నిర్వహించి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. దొడ్డు బియ్యం అక్రమ రవాణా రైస్ మిల్లర్ల రీసైక్లింగ్ వ్యవస్థలపై ప్రభుత్వం జిల్లా స్థాయి అధికారులు ఉక్కు పాదం మోపాలని కోరుతున్నాం. లేనిపక్షంలో మండల కేంద్రంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల నాయకులు కనకం తిరుపతి పాల్గొన్నారు.