
Social Media Tracking Center
చట్ట వ్యతిరేకమైన పోస్టులు పెడితే జైలుశిక్ష తప్పదు
జైపూర్,నేటి ధాత్రి:
ఇటీవల కాలంలో సామాజిక మాధ్యమాల్లో చట్టవ్యతిరేక పోస్టులు పెట్టేవారిపై ప్రత్యేక నిఘా పెట్టి చట్టపరమైన చర్యలు తీసుకోవడం లో భాగంగా రామగుండము పోలీస్ కమీషనరేట్ లో సోషల్ మీడియా ట్రాకింగ్ సెంటర్ (ఎస్ఎమ్ టిసి) పోలీస్ కమీషనరేట్ లో ఏర్పాటు చేయడం జరిగింది.ట్విటర్,ఫేస్బుక్, వాట్సాప్,ఇతర సోషల్ మీడియా వేదికగా కొందరు వివిధ రాజకీయ నేతలను టార్గెట్గా చేసుకుని పోస్టులు పెడితే,మరికొందరూ కులాలను,మతాలను, మతానికి సంబంధించిన ప్రముఖుల్ని టార్గెట్గా చేసుకుని పోస్టులు పెడుతున్నారు.ఓ వర్గాన్ని కించపరుస్తూ పోస్ట్ చేసినా,శాంతి భద్రతలకు విఘాతం కలిగించే రీతిలో పుకార్లు ప్రచారం చేసినా జైలుకు వెళ్లాల్సి ఉంటుంది.అలాంటి వారికి జైలు శిక్ష,జరిమానాతోపాటు కేసు తీవ్రతను బట్టి జీవిత ఖైదు పడే అవకాశం ఉంది.అదేవిధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేముందు,వచ్చిన పోస్టులను ఫార్వర్డ్ చేసేముందు అవి నిజమా కాదా అని ఒకసారి ఆలోచించుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. 24×7 నిరంతరం సోషల్ మీడియా పోస్ట్ లపై నిరంతరం నిఘా ఉండనుంది.రాజకీయ విద్వేషాలు రెచ్చగొట్టేలా,మత ఘర్షణల కలిగేలాగా,లా అండ్ ఆర్డర్ సమస్యలు సృష్టించే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని తెలిపారు.సోషల్ మీడియాలో మతాలను,కులాలను, ఒకరినొకరు కించపరుస్తూ గాని,లేనిపోని అబద్దపు పుకార్లను సృష్టించి ఎవరైనా సోషల్ మీడియా లో పోస్టులు పెడితే వారిపై సోషల్ మీడియా మానిటరింగ్ సెల్ నిఘా ఉంటుంది.సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకరమైన,చట్టవిరుద్ధమైన పోస్టులు పెట్టేవారిపై ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం-2000 ప్రకారం చర్యలు తప్పవని పోలీస్ లు హెచ్చరిస్తున్నారు.