*జహీరాబాద్లో హైడ్రా!*
*జహీరాబాద్ నేటి ధాత్రి:*
జహీరాబాద్ మున్సిపల్ పరిధిలోని హౌసింగ్ బోర్డ్ కాలనీ, సాయి నగర్ కాలనీల మధ్య ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మిస్తున్న సెల్ టవర్ ను మున్సిపల్ అధికారులు సోమవారం కూల్చివేశారు. స్థానికుల ఫిర్యాదు మేరకు, ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలనే విన్నపాల మేరకు ఈ చర్యలు చేపట్టారు. జెసిబి సహాయంతో సెల్ టవర్ కోసం ఏర్పాటు చేసిన సీసీ దిమ్మెను తొలగించారు. మున్సిపల్ అధికారుల ఈ చర్యల పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
