కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని చూడలేకే సోనియా రాహుల్ పైఅక్రమ కేసులు
ధర్నాలో వనపర్తిఎమ్మెల్యే మేఘారెడ్డి
వనపర్తి నేటిదాత్రి :
కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని చూసి ఓర్వలేని ప్రధాని మోడీ సర్కార్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు
నేషనల్ హెరాల్డ్ న్కేసులో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్ గాంధీ ల పేర్లు నమోదు చేయడాన్ని నిరసిస్తూ తెలంగాణ రాష్ట్ర టీ పీ సీ సీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఇచ్చిన పిలుపుమేరకు గురువారం ఖిల్లా ఘనపురం మండల కేంద్రంలో నిర్వహించిన ధర్నా లో వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పాల్గొన్నారు
ప్రతిపక్షాల మద్దతుతో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి కొనసాగిస్తున్న మోడీ ప్రభుత్వానికి త్వరలోనే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు
కాంగ్రెస్ పార్టీ పై కక్ష దింపు చర్యలు కొనసాగిస్తే చూస్తూ ఊరుకునేది లేదనిఎమ్మెల్యే ఆగ్రహం చేశారు నిరసన
కార్యక్రమంలో మహబూబ్ నగర్ జిల్లా డి సి సి బి అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి, వనపర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, ఖిల్లా ఘణపురం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు విజయకుమార్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, పాల్గొన్నారు