బిఆర్ఎస్వి నాయకుల అక్రమ అరెస్టులు..
నిజాంపేట, నేటి ధాత్రి
నిజాంపేట మండల కేంద్రంలో శనివారం బిఆర్ఎస్వి నియోజకవర్గ అధ్యక్షులు బజార్ రంజిత్ గౌడ్ ని నిజాంపేట పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ నుండి ఎలాంటి సమాచారం లేకుండానే కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నాయకులను అరెస్ట్ చేయడం దారుణం అన్నారు. ప్రతిపక్షాల నాయకుల మీద దృష్టి పెట్టకుండా ప్రభుత్వ పాలనపై దృష్టి సారించాలన్నారు. ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీల అమలు చేయకుండా కాలయాపన చేస్తుందని ఆరోపించారు. ఇకనైనా కాంగ్రెస్ పార్టీ బుద్ధి తెచ్చుకొని ఈ అక్రమ అరెస్టులకు పాల్పడకుండా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు.