
సిద్దిపేట నేటిధాత్రి…
బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు నిన్న చేవెళ్ల నియోజకవర్గం లోని జన్వాడ గ్రామంలో మైనారిటీ దళితులపై ఆర్ఎస్ఎస్ గుండాలు దాడి చేస్తే బాధితులను పరామర్శించడానికి వెళ్తున్న బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలిస్తున్న పోలీసులు. దానికి నిరసనగా బహుజన్ సమాజ్ పార్టీ సిద్దిపేట నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు సిద్దిపేట పట్టణంలోని స్థానిక అంబేద్కర్ సర్కిల్ దగ్గర రాస్తారోకో నిర్వహించారు. మైనార్టీ దళితులపైన ఆర్ఎస్ఎస్ గుండాలు దాడి చేస్తే ఇప్పటివరకు ఒక్కరిని కూడా అరెస్టు చేయకుండా చోద్యం చేస్తున్న పోలీసులు. తక్షణమే దాడి చేసిన వారిని అరెస్టు చేసి జైలుకు పంపాలి. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలి లేని పక్షంలో ఈ కార్యక్రమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి లింగంపల్లి యాదగిరి, జిల్లా ఇన్చార్జి రోమాల బాబు, అసెంబ్లీ ఇన్చార్జి బక్రీ చెప్పాలాఅశోక్, అసెంబ్లీ అధ్యక్షుడు పుల్లూరు ఉమేశ్, అసెంబ్లీ కార్యదర్శి రంగదాం భాను, ముండ్రాయి లింగం, సుమన్, రాజు స్థానిక నాయకులు పాల్గొన్నారు.