ఐకెపి వివోఎలు ఛలో హైదరాబాద్ కార్యక్రమం విజయవంతం చేయండి.
జహీరాబాద్. నేటి ధాత్రి
న్యాల్కల్ మండల కేంద్రములోని ఇందిరా క్రాంతి పథకం ఆఫిస్ లో వివోఏల అధ్యక్షుడు నాగేందర్ ఆధ్వర్యంలో ఐకెపి వివోఎల సమావేశం శనివారం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో అధ్యక్షుడు నాగేందర్ మాట్లాడుతూ ఐకెపి వివోఏల సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం పరిష్కారం చేయాలని, ఐకెపి వివోఎలందరు కదిలి వచ్చి రాష్ట్ర కమిటీ తల పెట్టిన ఛలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.