ఐకెపి వివోఏ లా ముందస్తు అరెస్ట్
జైపూర్,నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం లోని ఐకెపి వివోఏ రమేష్,లింగన్న,పద్మ,వినోద, కొమురయ్య,గట్టయ్య లను ముందస్తుగా అరెస్టు చేసి మంగళవారం జైపూర్ పోలీస్ స్టేషన్ కి తరలించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 20,000 వేల రూపాయల జీతంతో పాటు ఇన్సూరెన్స్,ఉద్యోగం భద్రత, డ్రెస్ కోడ్ వంటి అనేక డిమాండ్లను కచ్చితంగా తీర్చుతామని ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది.కానీ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి ఇన్ని రోజులు అవుతున్న ఎన్నికల మేనిఫెస్టోలో ఏర్పర్చిన ఏ ఒక్క హామిని కూడా తీర్చలేదని తమ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఐకెపి వివోఏ ఉద్యోగుల సంఘం సిఐటియు ఆధ్వర్యంలో హైదరాబాదులోని సెర్ఫ్ కార్యాలయంలో మంగళవారం నిరసన చేపట్టే కార్యక్రమాన్ని అడ్డుకోవడం తమకు తగదని అన్నారు.