ఐకెపి హమాలీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి.

ఏఐటీయుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలరాజు

కరీంనగర్, నేటిధాత్రి:

కరీంనగర్ జిల్లాలోని ఐకెపి హమాలీ కార్మిక సమస్యలు వెంటనే పరిష్కరించాలని గురువారం జిల్లా ఐకెపి కోఆపరేటివ్ సొసైటీ సెంటర్ హమాలి కార్మికుల సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈసందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలరాజు మాట్లాడుతూ కరీంనగర్ జిల్లాలో వడ్ల కొనుగోలు ఐకెపి, డిసిఎంఎస్, పిఏసిఎస్సి సొసైటీల ద్వారా జరుగుతుందని ఇందులో పనిచేస్తున్న హమాలి కార్మికులు, సాటసడెం చేస్తున్న మహిళా కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలం చెందిందని ఆయన ఆరోపించారు. కోనుగోలు కేంద్రాలలో ట్రాక్టర్, లారీ లోడైన తర్వాత తాడు కట్టుట కూలి ఒక టన్నుకు అరవై రూపాయలు చెల్లించాలని పనిచేస్తున్న సమయంలో ప్రమాదం జరిగితే ప్రభుత్వ ప్రమాద బీమా కల్పించాలని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కూలీ రేట్లు పెంచి క్వింటాలకు ఎనబై రూపాయలు ఇవ్వాలని ఐకెపి కేంద్రాలలో మంచినీటి సౌకర్యం విశ్రాంతి గది మెడికల్ కిడ్స్ ఏర్పాటు చేయాలని కోరారు. పనిచేసే ప్రతి కార్మికునికి ప్రభుత్వం గుర్తింపు కార్డులు ఇవ్వాలని 55 సంవత్సరాల పైబడి నిండిన వారికి పెన్షన్స్ సౌకర్యం కల్పించాలని, హమాలి కార్మికులందుకి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టించి ఇవ్వాలని, ఇతర రాష్ట్రాల నుండి వలస వచ్చిన కార్మికులను పనిలోకి తీసుకోకుండా స్థానిక కార్మికులకు పని కల్పించి దళారి వ్యవస్థను రద్దు చేయాలని, కార్మికులందరికీ ప్రభుత్వం హెల్త్ కార్డులు ఇచ్చి ఉచిత వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. ధర్నా అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీ కిరణ్, సివిల్ సప్లై మేనేజర్ కి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈదర్నా కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి టేకుమల్ల సమ్మయ్య, జిల్లా ఐకెపి కో-ఆపరేటివ్ సొసైటీ సెంటర్ హమాలి కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు నెల్లి రాజేశం, ప్రధాన కార్యదర్శి కటికరెడ్డి బుచ్చన్న యాదవ్, ఉపాధ్యక్షులు జంగం లింగయ్య, పిట్టల సమ్మయ్య, పిట్టల శ్రీనివాస్, నెల్లి రవీందర్, రాజయ్య, బోనాల బుచ్చయ్య, అంజయ్య, కత్తి రాములు, ఎల్లయ్య, భూమయ్య, బాలయ్య, చిన్న వేణి సమ్మయ్య, గొల్లపల్లి రాజయ్య, గంగుల శంభులింగం, గంగుల ఐలయ్య మహిళా నాయకురాల్లు జాడి చామంతి, జాడి పద్మ, శారద, బౌతు విజయ జిల్లాలోని అనేక కొనుగోలు కేంద్రాల నుండి హమాలీ కార్మికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *