
IKP centers
ఐకెపి సెంటర్లు మహిళలకు కేటాయించి కొట్టించడమే నా మహిళల అభివృద్ధి
డి.ఎస్.పి జిల్లా ప్రధాన కార్యదర్శి కండే రవి
గణపురం నేటి ధాత్రి:
గణపురం మండల కేంద్రంలో ఉన్న బుర్రకాయల గూడెం ఐకెపి సెంటర్ వద్ద జరిగిన గొడవల్లో మాజీ ఎంపీటీసీ సాగర్ తన అనుచరులు ముగ్గురు మహిళలపై దాడి చేసిన విషయం అందరికీ తెలిసినదే. దాడిలో గాయపడిన ఆకుల రేణుక వాళ్ళ ఇంటికి వెళ్లి ధర్మ సమాజ్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కండె రవి,మండల అధ్యక్షులు కుర్రి స్వామినాదన్ పరామర్శించడం జరిగింది.
ఈ గొడవకు సంబంధించిన అన్ని విషయాలు తెలుసుకుని అధికార పార్టీ అండదండలతోని చట్టం అంటే భయం లేకుండా తనపై కేసు ఉన్నదనే విషయం తెలిసి కూడా మహిళలపై విచక్షణ రైతంగా దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అధికార పార్టీ ధాన్యం కల్లాలను మహిళలకు కేటాయించి కొట్టించడమేన మహిళళ అభివృద్ధి అంటే ఇట్టి విషయాన్ని అధికారులు ఇంతవరకు పట్టించుకోకపోవడం వల్లనే ఇదంతా జరిగింది మాకు పార్టీలు కాదు ప్రజలే ముఖ్యం కనుక అన్యాయం జరిగిన వారి పక్షాన న్యాయం జరిగేంత వరకు ధర్మసమాజ్ పార్టీ తోడుగా ఉంటుంది ఇప్పటికైనా అధికారులు, అధికారంలో ఉన్న నాయకులు వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. తగు న్యాయం జరగని ఎడల బాధితులతో కలసి ధర్నా రాస్తారోకల తో న్యాయం జరిగే వరకూ పోరాడుతామని తెలియజేయడం జరిగింది.