ఆర్ట్స్ కళాశాలలో ఐఐటి జామ్ అవగాహన కార్యక్రమం

 

హనుమకొండ లోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో జాతీయస్థాయి ప్రవేశ పరీక్ష ఐఐటీ జామ్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఐఐటి మద్రాస్ నుంచి ప్రొఫెసర్ బీరయ్య హాజరై విద్యార్థినుల ఉద్దేశించి మాట్లాడారు. జాయింట్ అడ్మిషన్ ఫర్ మాస్టర్స్ కు అప్లై చేసే అభ్యర్థులలో తెలుగు రాష్ట్రాల నుండి తక్కువమంది పాల్గొంటున్నారని, ప్రతిష్టాత్మకమైన ఐఐటి లలో చదువుకున్నట్లయితే ఉద్యోగ అవకాశాలు మెరుగుగా ఉంటాయని, బంగారు భవిష్యత్తుకు ఐఐటి లు పునాదులు వేస్తాయి అన్నారు. అవగాహన లోపంతో తెలుగు విద్యార్థులు ఈ పరీక్షకు తక్కువ సంఖ్యలో అప్లై చేస్తున్నారు అని అన్నారు. సీటు సాధించిన ప్రతి విద్యార్థికి బ్యాంకులు రుణ సౌకర్యాన్ని కూడా కల్పిస్తాయని తెలిపారు. అక్టోబర్ 13 జామ్ ప్రవేశ పరీక్షకు చివరి తేదీ అని ఎక్కువ మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకొని తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ ఆచార్య హనుమంతు మాట్లాడుతూ విద్యార్థులు డిగ్రీ మొదటి సంవత్సరం నుంచే ఒక నిర్దిష్ట ప్రణాళిక సిద్ధం చేసుకుంటే జాం సాధించడం కష్టమేమి కాదని అన్నారు. ఈ కార్యక్రమంలో గణిత విభాగ అధ్యాపకులు డాక్టర్ టి నాగయ్య, డాక్టర్ శ్రీలక్ష్మి , డాక్టర్ మంజుల, డాక్టర్ శ్రీలత, రాజ్ కుమార్, పిఆర్ఓ డాక్టర్ ఆదిరెడ్డి పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *