ది స్కౌట్స్ జిల్లా ఆర్గనైజింగ్ కమీషనర్ గా ఇగురం శ్రావణ్
ఉత్తర్వులు జారీ చేసిన ఎస్ జీ ఓ కమీషనర్ ఆఫ్ ఇండియా
భూపాలపల్లి నేటిధాత్రి
మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం గొర్లపల్లి గ్రామానికి చెందిన ఇగురం శ్రావణ్ ను జయశంకర్ భూపాలపల్లి జిల్లా స్కౌట్స్ జిల్లా ఆర్గనైజింగ్ కమీషనర్ గా నియమిస్తూ నేషనల్ కమీషనర్ ఆఫ్ ఇండియా న్యూఢిల్లీ వారు ఉత్తర్వులు జారి చేశారు. ఇట్టి విషయాన్ని తెలంగాణ రాష్ట్ర స్కౌట్స్ ఆర్గనైజింగ్ కమీషనర్ అశోక్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండల వాసి జయ శంకర్ భూపాలపల్లి జిల్లాకి ఎస్ జి ఓ కమీషనర్ గా నియమించబడినందుకు ఇగురం శ్రావణ్ కు పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు.
