
హైదరాబాద్
ప్రపంచములోనే అతి పెద్ద విశ్వ విద్యాలయమైన ఇందిరా గాంధీ జాతీయ సార్వత్రిక విశ్వ విద్యాలయము 37 వ స్నాతకోత్సవాన్ని ఫిబ్రవరి 20 వ తేదీన ఇగ్నో ప్రధాన కార్యాలయమైన న్యూ ఢిల్లీ లోని బాబా సాహెబ్ అంబేద్కర్ కన్వెన్షన్ సెంటర్ నందు నిర్వహించి, దేశ వ్యాప్తంగా 3,08,584 డిగ్రీ, డిప్లొమా మరియు సర్టిఫికెట్ స్నాతకోత్సవ డిగ్రీలను ప్రధానం చేశారు.
ఈ కార్యక్రమానికి గౌరవ భారత ఉపరాష్ట్రపతి శ్రీ జగదీష్ ధన్కర్ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యి స్నాతకోత్సవాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ దూర విద్య విధానం లో ఇగ్నో సేవలను వారు ప్రశంసించారు. ఈ స్నాతకోత్సవంను ఉద్దేశించి స్వాగతోపన్యాసం చేసిన ఇగ్నో వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జి నాగేశ్వర్ రావు ఇగ్నో దేశాభివృద్ధిలో ఇగ్నో తన వంతు పాత్రను పోషిస్తున్నదని వారు పేర్కొన్నారు. హైదరాబాద్ ప్రాంతీయ కేంద్రములో జరిగే ప్రాంతీయ స్నాతకోత్సవం ఎన్ టి ఆర్ ఆడిటోరియం , శ్రీ పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ నందు నిర్వహించిన 37 వ స్నాతకోత్సవానికి ప్రొఫెసర్ కే సీతా రామారావు ఉపకులపతి, డాక్టర్ బి ఆర్ అంభేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ గౌరవ అతిధిగా పాల్గొని ఇగ్నో నూతన విద్య విధానంలో అందిస్తున్న వివిధ రకాలైన ప్రోగ్రాములు, విద్యార్థులను ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దడం తో పాటు అనేక రంగాలలో ఉద్యోగావకాశాలను కల్పిస్తున్నాయి అని వారు పేర్కొన్నారు. హైదరాబాద్ ప్రాంతీయ కేంద్రానికి సంబంధించి 2471 డిగ్రీ, డిప్లొమా మరియు సర్టిఫికెట్ స్నాతకోత్సవ డిగ్రీలను ప్రధానం చేశారు. డాక్టర్ బి రాజగోపాల్, రీజినల్ డైరెక్టర్ వార్షిక నివేదకను ప్రకటిస్తూ , హైదరాబాద్ ప్రాంతీయ కేంద్రం ప్రతి కాన్వకేషన్ లో బంగారు పథకాలను సాధించడంతో పాటుగా దేశవ్యాప్తం గా అందిస్తున్న అనేక రకాల నూతన ప్రోగ్రాములను తెలంగాణ ప్రాంత విద్యార్థులకు అందుబాటులోకి తేవడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది అని వారు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ కే రమేష్ , డాక్టర్ పి ఎం సౌజన్య , డాక్టర్ రాజు బోళ్ల డి వి రమణ మరియు ఇతర ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు.