గుట్టల్ని లూటీ చేస్తున్న పట్టించుకోని రెవెన్యూ మైనింగ్ అధికారులు.

వెంటనే జిల్లా కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్.

లేనిపక్షంలో ప్రజాసంఘాలతో ఏకమై ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరిక.

సిపిఐ ఎం లిబరేషన్ జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్.

చిట్యాల,నేటిధాత్రి :

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని కైలాపూర్ గ్రామపంచాయతీ శివారులోని శాంతినగర్ గుట్టల్లో అక్రమ మొరం ఐరన్ఓర్ దందా మళ్ళీ మొదలైందని సంబంధిత రెవిన్యూ మైనింగ్ అధికారులు పట్టించుకోవడంలేదని గత కొన్ని నెలల క్రితం అక్రమార్కులు జెసిబి ట్రాక్టర్లతో అక్రమంగా మొరం ఐరన్ఓర్ ను తరలించారని ఇప్పుడు మళ్లీ గత మూడు రోజుల నుండి అదే దందా ను సంబంధిత అధికారుల అండదండలతో యతేచ్చగా జరుపుతున్నారని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్ ఆరోపిస్తున్నారు, ఈ విషయంపై జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ సంబంధిత రెవెన్యూ మైనింగ్ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ డిమాండ్ చేస్తున్నాము, శాంతినగర్ గుట్టలోని టేకులబోడు గుట్టను అక్రమార్కులు మొరం దందాతో దాన్ని పూర్తిగా అంతం చేశారని ఆరోపిస్తున్నాం. అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడంతోనే ఈ తతంగం మొత్తం జరుగుతుందని చిట్యాల టేకుమట్ల రెండు మండలాల అధికార పార్టీ నాయకుల అండదండలతోనే అక్రమ మొరం దందా జరుగుతుందని ఆరోపిస్తున్నాం. ప్రభుత్వాలు మారిన అదే అక్రమ దందా కొనసాగుతూ ఖనిజ సంపదను సహజ వనరులను దోచుకోవడం ఆగడం లేదు. శాంతినగర్ గుట్టలకు సంబంధించిన 172 ఎకరాల భూమిని అక్రమంగా కొంతమంది పట్టా చేసుకొని గుట్టలు మావే అంటూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని గుట్టలు ప్రజా సంపద కాబట్టి గుట్టలను ప్రభుత్వాలు కాపాడాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
అక్రమంగా తరలిపోతున్న మొరం దందాను ఆపాలని జిల్లా అధికార యంత్రాంగం స్పందించి శాంతినగర్ గుట్టలను కాపాడాలని కోరుతున్నాం. లేనిపక్షంలో అన్ని ప్రజా సంఘాలతో ఏకమై ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!