ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
భూపాలపల్లి నేటిధాత్రి
మత సామరస్యానికి ప్రతీక ఇఫ్తార్ విందు అని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. భూపాలపల్లి పట్టణంలోని భారత్ ఫంక్షన్ హాల్ లో ముస్లిం సోదరులకు ఎమ్మెల్యే ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 30 రోజులపాటు ముస్లింలు కఠినమైన ఉపవాస దీక్ష చేపడతారని, ఉపవాస దీక్ష ముగిసే సమయంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. ఈ రంజాన్ ను ముస్లింలందరూ ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు, నాయకులతో పాటు పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు.