కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు
జహీరాబాద్. నేటి ధాత్రి:
జహీరాబాద్ నియోజకవర్గం లోని ఝరాసంగం మండలం కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ఇఫ్తార్ విందు పట్టణం లోని షాది ఖానా లోనీ నిర్వహించారు ముఖ్య అతిథులుగా పాల్గొన్న మండల కాంగ్రెస్ అధ్యక్షులు హనుమంతరావు పటేల్ సంగారెడ్డి జిల్లా డిసిసి ఉపాధ్యక్షులు ఎండి ముల్తాని మండల ఎమ్మార్వో తిరుమల రావు డిప్యూటీ ఎమ్ఆర్ఓ ఆసిన్ హనుమంతరావు పాటిల్ మాట్లాడుతూ ముందుగా ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఇఫ్తార్ విందు లో వారితో కలిసి పాల్గోని పండ్లు, ఫలహారాలు తినిపించారు. రంజాన్ అంటేనే నియమ నిష్ఠలతో కూడుకున్న పండుగా అని, నిబద్ధత తో ఎలా జీవనం సాగించాలో చాటి చేప్పే పవిత్ర మాసం రంజాన్ అని అన్నారు. కులమతాలకు అతీతంగా పండుగలు అందరూ కలిసిమెలిసి ఆనందంగా జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు. తాజా మాజీ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఉదయ్ శంకర్ పాటిల్ ముస్లిం మత పెద్దలు యువజన కాంగ్రెస్ అధ్యక్షులు రాఘవేందర్ ముస్లిం నాయకులు ఆన్సర్ . లియాకత్ ఆఫీస్ షకీల్ షకీర్ శంకర్ పాటిల్ తాజా మాజీ ఎంపిటిసి శంకర్ పాటిల్ అశ్విని పాటిల్ ఇస్మాయిల్ సాబ్ అసఫ్ అలీ వేణుగోపాల్ రెడ్డి. ముస్లిం సోదరులు వివిధ గ్రామాల సర్పంచులు ఎంపిటిసిలు కాంగ్రెస్ నాయకులు యువజన కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.