కోటగుళ్లలో ఐఎఫ్ఎస్ అధికారి పూజలు
గణపురం నేటి ధాత్రి
గణపురం మండల కేంద్రంలో ప్రసిద్ధిగాంచిన చారిత్రక సంపద కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్లలో ఐఎఫ్ఎస్ ప్రొబిషనరీ చంద్ర ప్రకాష్ సింగాల్ బుధవారం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయ అర్చకులు జూలపల్లి నాగరాజు వారిని సాదరంగా ఆహ్వానించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం శాలువాలు పూలమాలతో ఘనంగా సన్మానించి ఆశీర్వచనాలు తీర్థ ప్రసాదాలను అందజేశారు.
