కష్టపడి చదివితే మంచి ఫలితాలు సాధించవచ్చు…… జిల్లా ఇంటర్ మోడల్ అధికారి సత్యనారాయణ…… రామాయంపేట (మెదక్) నేటి ధాత్రి. విద్యార్థులు కష్టపడి చదివితే మంచి ఫలితాలు సాధిస్తారని జిల్లా ఇంటర్ విద్యాశాఖ నోడల్ అధికారి సత్యనారాయణ చెప్పారు శనివారం పట్టణంలో గల ప్రభుత్వ జూనియర్ కళాశాలను తనిఖీ చేశారు ఈ సందర్భంగా కళాశాలలో గల పలు రిజిస్టర్లను ఆయన పరిశీలించారు అనంతరం లెక్చరర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా లెక్చరర్లకు పలు అంశాలపై అవగాహన కల్పించారు త్వరలో ఇంగ్లీష్ లెక్చరర్ లకు శిక్షణా తరగతులు నిర్వహించడం జరుగుతుందన్నారు అనంతరం తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థులతో ఆయన మాట్లాడారు ప్రతి విద్యార్థి ప్రతి సబ్జెక్టు పై పట్టు సాధించుకోవాలని సూచించారు జిల్లాలో 60 జూనియర్ కళాశాలలో ఉన్నాయని చెప్పారు అందులో రామయంపేట కళాశాల విద్యార్థులు మంచి ఫలితాలు సాధించి జిల్లాకు కళాశాలకు పేరు తీసుకురావాలని సూచించారు అనుభవం గల అధ్యాపకులచే విద్యాబోధన చేయించడం జరుగుతుందన్నారు ఈ సందర్భంగా విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్, కృష్ణారెడ్డి లెక్చరర్లు మల్లేశం బాల ప్రకాష్ బాబురావు బాలా గౌడ్, అశోక్ గౌడ్ సురేందర్ రెడ్డి ఆంజనేయులు సురేష్ శ్రీశైలం యాదగిరి మస్తాన్ శ్రీదేవి మంగ పాల్గొన్నారు