ఆత్మవిశ్వాసం మన ఆయుధం అయితే విజయం మన బానిస
సైకాలజిస్ట్ పోగు అశోక్
శాయంపేట నేటి ధాత్రి:
విద్యార్థులు పరీక్ష ఉంటే భయం లేకుండా స్వేచ్ఛగా ఆత్మ విశ్వాసంతో రాయాలి అని తెలంగాణ సైకాలజిస్ట్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ పోగు అశోక్ విద్యార్థులకు సూచించారు. తెలంగాణ ప్రభుత్వ బాలుర గురుకుల పాఠశాల శాయంపేట ఇంచార్జ్ అధ్యక్షతన జరిగిన విద్యార్థులకు ప్రేరణ సదస్సులో భాగంగా సైకాలజిస్ట్ పోగు అశోక్ విద్యార్థులకు వివిధ అంశాలపై సూచనలు ఇస్తూ పరీక్షలకు ఎలా సన్నద్ధం కావాలో తెలియజేస్తూ వారిని ఉత్తేజితులను చేశారు. ప్రతి విద్యార్థి కూడా పరీక్షలంటే భయం లేకుండా ఆత్మవిశ్వాసంతో పరీక్షలను రాయాలని , భయపడితే మనలో ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతుంది కాబట్టి ప్రతి విద్యార్థి కూడాఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకున్నప్పుడే విజయాలు లభించడం సులభం అవుతుందని, ఆత్మవిశ్వాసం మన ఆయుధం అయితే విజయం మన బానిస అవుతుంది అని ఆత్మవిశ్వాసంతో ప్రతి పరీక్షలను విజయవంతంగా పూర్తి చేయాలని సూచిస్తూ.. విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలని ఆసక్తితో చదివినట్లయితే అది మనస్సులో చిరస్థాయిగా నిలిచిపోతుందని, ఆసక్తి ఉంటే ఏ శక్తి కూడా మనల్ని ఆపలేదని విద్యార్థులను ఉత్తేజితులను చేశారు. విజయం లభించాలంటే సమయాన్ని వృథా చేయకుండా సరైన రీతిలో ఉపయోగించుకోవాలని, కాలాన్ని అర్ధం చేసుకున్నవాడు జీవితాన్ని వ్యర్థం చేసుకోడు అంటూ కాలం విలువ తెలుసుకోవాలనిసూచించారు.ఈ సందర్భంగా ఇంఛార్జి నిర్మల మాట్లాడుతూ విద్యార్థులకు ఇలాంటి ప్రేరణ అవగాహన సదస్సులు చాలా చాలా అవసరమని, దాని ద్వారా విద్యార్థులలో కొంత అవగాహన కలిగి వారు ఉత్తేజితులు అయ్యే అవకాశం ఉంటుందని చెప్పారు. ఈ సందర్భంగా సైకాలజిస్ట్ పోగు అశోకుని ప్రిన్సిపాల్ మేడం మరియు ఉపాధ్యాయ బృందం అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రవణ్ , స్వప్న, ధన్ పాల్, సురేష్, నిర్మల పాల్గొన్నారు.