పుర కమిషనర్ ఎన్ మురళీకృష్ణ
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
తెలంగాణ పురపాలక కమీషనర్ ,పురపాలక డైరెక్టర్ ఆదేశాల మేరకు క్యాతనపల్లి పుర పరిధిలో వేసవికాలం దృష్ట్యా త్రాగు నీటి సరఫరాలో ఏవైనా ఇబ్బందులు, సమస్యలు,నీటి పైపుల లీకేజీలు ఉంటే క్యాతనపల్లి మున్సిపాలిటీ నందు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయటం జరిగిందని, కంట్రోల్ రూమ్ లో తమ సమస్యలను తెలియపరచాలని మున్సిపల్ కమీషనర్ ఎన్ మురళి కృష్ణ పేర్కోన్నారు.నీటి సరఫరాలో ఏవైనా ఇబ్బందులు ఉంటే పట్టణ ప్రజలు ఈ నంబర్లకు ఫోన్ చేయాలని కోరారు. ఇంచార్జ్ సానిటరి ఇన్స్పెక్టర్ వసంత్ 8309960731, (ఓఎస్) వర్క్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ 8074138866,వాటర్ సప్లయ్ సూపర్ వైజర్ బంటు నారాయణ 9391640311 ఫోన్ నంబర్ల ను సంప్రదించి తమ సమస్యలను తెలియపరచాలని కోరారు.