ఏఐటీయూసి సెంట్రల్ సెక్రటరీ అక్బర్ అలీ…
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
ఏఐటీయూసి యూనియన్ ను హెచ్ఎంఎస్ యూనియన్ నాయకుడు విమర్శిస్తే చూస్తూ ఊరుకోమని ఏఐటియుసి సెంట్రల్ సెక్రటరీ అక్బర్ అలీ అన్నారు. సోమవారం రామకృష్ణాపూర్ పట్టణంలోని సిహెచ్పీలో ఫిట్ కార్యదర్శి హరి రామకృష్ణ ఆధ్వర్యంలో ద్వార సమావేశం ఏర్పాటు చేయగా ముఖ్య అతిథులుగా ఏఐటియుసి ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఇప్ప కాయల లింగయ్య తో కలిసి సెంట్రల్ సెక్రటరీ అక్బర్ అలీ పాల్గొన్నారు. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలలో గెలిచిన ఏఐటియుసి సంఘాన్ని విమర్శించే స్థాయి హెచ్ఎంఎస్ నాయకుడికి లేదని అన్నారు. గతంలో రామకృష్ణాపూర్ సిహెచ్పీలో హెచ్ఎంఎస్ నాయకుడు ఫిట్ సెక్రటరీగా కొనసాగిన సమయంలో ఆయన ఆగడాలకు అంతులేకుండా పోయిందని దుయ్యబడ్డారు. ఇప్పటికైనా హెచ్ఎంఎస్ నాయకుని తీరు మార్చుకోకుంటే రాబోయే రోజుల్లో కార్మిక క్షేత్రంలో తగిన బుద్ధి చెప్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ కమిటీ మెంబర్లు కృష్ణస్వామి, శ్రీధర్ రావు ,సీతారామరావు, భాస్కర్, జంగం శ్రీనివాస్, కోటేశ్వరరావు, శ్రీనివాస్ యాదవ్, కార్మికులు పాల్గొన్నారు.