AP Home Minister Warns SVS Chemical Industries After Fire Accident
ఇలాంటి ఘటనలపై నిర్లక్ష్యం వహిస్తే ఎవరినీ ఉపేక్షించేది లేదు..హోంమంత్రి వార్నింగ్
SVS కెమికల్ ఇండస్ట్రీస్ కంపెనీ ప్రతినిధులపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనల పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఎవరినీ ఉపేక్షించేది లేదని వార్నింగ్ ఇచ్చారు.అచ్యుతాపురం సెజ్‌లో నిన్న జరిగిన అగ్నిప్రమాదం దురదృష్టకరమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత (AP Home Minister Vangalapudi Anitha) వ్యాఖ్యానించారు. రాంబిల్లి మండలం, అచ్యుతాపురం, ఏపీఎస్ఈజడ్లో SVS కెమికల్ ఇండస్ట్రీస్ వద్ద నిన్న(శనివారం) భారీ అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ సంఘటన స్థలాన్ని హోంమంత్రి అనిత, యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రమాదం ఎలా జరిగిందో కంపెనీ ప్రతినిధులను, అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈక్రమంలో SVS కెమికల్ ఇండస్ట్రీస్ కంపెనీ ప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేశారు హోంమంత్రి అనిత.
