ప్రశ్నించే గొంతుక ఏఐటీయూసీ సంఘం
ప్రైవేటీకరణతో సింగరేణికి ప్రమాదం
సింగరేణి ఎన్నికల్లో ఏఐటియుసి ని గెలిపించండి
ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి రమేష్
భూపాలపల్లి నేటిధాత్రి
సింగరేణిలో కొత్త గనులు రాకుండా సింగరేణి మనుగడ ప్రశ్నార్ధకమేనని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి మోటపలుకుల రమేష్ అన్నారు. భూపాలపల్లి ఏరియాలోని కేటీకే ఓ సీ-2 లో పిట్ సెక్రెటరీ యండి.కరీముల్లా అధ్యక్షతన నిర్వహించిన గేటు మీటింగ్లో బ్రాంచ్ కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ.. గతంలో టీబీజీకేఎస్ సింగరేణి గుర్తింపు సంఘంగా ఎన్నికై కార్మికులకు చేసిందేమీ లేదని, ఐ ఎన్ టి యు సి, బి ఎం ఎస్ సంఘాలు కార్మిక సమస్యలపై ఈరోజు మాట్లాడిన చరిత్ర లేదన్నారు. కేవలం సింగరేణిలో కార్మికుల పక్షాన ప్రశ్నించే గొంతుకగా ఏఐటీయూసీ పనిచేస్తుందని అన్నారు. గతంలో అనేక హక్కులు సాధించిన ఘనత ఏఐటియూసీ కి ఉందన్నారు.గతంలో సింగరేణి లాభాల వాటా దీపావళి దసరా బోనసులను సాధించిన చరిత్ర ఎర్రజెండా సంఘాని దే అన్నారు. సింగరేణి కాలరీస్ వర్కర్స్ ఆధ్వర్యంలో అనేక పోరాటాలు నిర్వహించి కార్మిక హక్కులను సాధించుకుందామని తెలిపారు. టీబీజీకేస్ గుర్తింపు సంఘంగా గెలిచిన 10 ఏళ్లలో వారు కార్మికులకు చేసిందేమీ లేదని విమర్శించారు. గడిచిన 10 సంవత్సరాలలో స్ట్రక్చర్ మీటింగ్ లు పెట్టక కార్మిక సమస్యలను పట్టించుకున్న పాపనా పోలేదన్నారు. కార్మిక సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేసే ఏఐటీయూసీని ఈనెల 27న జరిగే సింగరేణి ఎన్నికల్లో ఏఐటీయూసీని ఆదరించి భారీ మెజారిటీతో గెలిపించాలని సింగరేణిలో గుర్తింపు సంఘంగా గెలిచిన వెంటనే కార్మిక కార్మిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని రమేష్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాతంగి రామచందర్ వైస్ ప్రెసిడెంట్,గంగసారపు శ్రీనివాస్ అసిస్టెంట్ బ్రాంచ్ సెక్రటరీ, తోట రామచందర్ మైనింగ్ స్టాఫ్ ఇంచార్జ్,నూకల చంద్రమౌళి బ్రాంచ్ నాయకులు,పి శ్రీనివాస్,
పి.నారాయణ, సమకృష్ణ,
అల్లి.చేరాలు, ఏ.పర్వతాలు,
యన్.రవీందర్,
జి.రమేష్,పి.రాజేంద్రప్రసాద్, కె.సారయ్య,యం.రమేష్,
డి.సింగ్,
తోడేటి రవీందర్,
కట్టే కొల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.