ఎస్సీ వర్గీకరణ బిల్లుపై నరేంద్ర మోడి ప్రకటన చేయకపోతే బిజేపి ద్రోహిగా మిగులుతారు

మాదిగలను మోసం చేస్తున్న కాంగ్రెస్.

బొచ్చు తిరుపతి మాదిగ
ఎంఎస్ ఎఫ్ తెలంగాణరాష్ట్ర ప్రధాన కార్యదర్శి

పరకాల నేటిధాత్రి(టౌన్)
పరకాల పట్టణ తహసిల్దార్ ఆఫీస్ ముందు ఎమ్మార్పీఎస్ మండల ఇంఛార్జి జీల్లెల మురళీ మాదిగ ఆధ్వర్యంలో ఎమ్మార్పీఎస్ నిరసన దీక్షలు చేపట్టారు.ఈసందర్భంగా బొచ్చు తిరుపతి మాదిగ స్థానిక 18 వ వార్డు కౌన్సిలర్ ఏక్ రాజు
నిరాహార దీక్షలు ప్రారంబించారు.సమావేశానికి ముఖ్య అతిథులు పాల్గొన్న బొచ్చు తిరుపతి మాదిగ మాట్లాడుతూ 18 నుండి 22 వరకు జరుగుతున్న ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో నరేంద్ర మోడీ ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రకటించాలని డిమాండ్ చేశారు.మాదిగ ఉప కులాల ప్రజలంతా అమిత్ షా చేసే ప్రకటన కోసం ఆశతో ఎదురుచూస్తున్నారు.వారి ఆశలను భంగం చేయొద్దని అన్నారు.18 వ తేది నుండి 22 వరకు అయిదు రోజుల పాటు జరిగే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిజంగా ప్రజల ప్రయోజనాల కోసమే అయితే కోటి మంది మాదిగ ప్రజల చిరకాల ఆకాంక్ష అయిన ఎస్సీ వర్గీకరణను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టడం బిజేపి నైతిక ధర్మం అని దేశంలో బిజేపి పరిష్కారం చేయాల్సిన సమస్యల్లో ప్రథమ స్థానంలో ఎస్సీ వర్గీకరణ ఉందని అన్నారు.ప్రధానమంత్రి,స్వయంగా హామీ ఇచ్చినా,ఇప్పటికీ వర్గీకరణ చేయకపోవడం మాదిగ జాతికి అన్యాయం చేయడమే అవుతుందని అన్నారు,హైదరాబాద్ కేంద్రంగా ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టే తేదీని ప్రకటించి మాదిగల హృదయాల్లో నిలిచిపోవాలని అన్నారు,ఎస్సీ వర్గీకరణ మీద ప్రకటన చేయకపోతే బీజేపీకి రాజకీయంగా మాదిగలు శాశ్వతంగా దూరం అవుతారని హెచ్చరించారు.హైద్రాబాద్ లో కాంగ్రెస్ నిర్వహిస్తున్న సీడబ్ల్యూసీ సమావేశంలో ఎస్సీ వర్గీకరణ అంశం మీద చర్చ చేయకపోవడం బాధాకరమని,సి డబ్ల్యు సి లో ఎస్సీ వర్గీకరణ మీద తీర్మానం చేయకపోతే చేవెళ్ల డిక్లరేషన్ కు విలువ లేనట్లే అని అన్నారు.రాహుల్ గాంధీ, మల్లిఖార్జున్ ఖర్గే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో లేవనెత్తి కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు.గత పది ఎండ్లుగా పార్లమెంట్ లో కాంగ్రెస్ ఎస్సీ వర్గీకరణ మీద మౌనంగా ఉండి మాదిగలను దూరం చేసుకుంటుందని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంఎసెఫ్ నియోజకవర్గ ఇన్చార్జి బొజ్జ హేమంత్ మాదిగ,నూతన్, కార్తిక్,జశ్వంత్,బాబ్బు, సనత్,సాయి చందు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!