నర్సంపేటకు మంత్రులు వస్తే అరెస్ట్ లా..?

# మాజీ ఎమ్మెల్యే, బీఅర్ఎస్ రాష్ట్ర నేత పెద్ది సుదర్శన్ రెడ్డి.
# నల్లబెల్లిలో మాజీ ఎమ్మెల్యే పెద్ది హౌస్ అరెస్ట్.
# నర్సంపేట డివిజన్ వ్యాప్తంగా బీఅర్ఎస్ నేతల హౌస్ అరెస్టులు.

నర్సంపేట,నేటిధాత్రి :

కేసీఆర్ ప్రభుత్వం హయాంలో ప్రభుత్వ మెడికల్ కళాశాల,ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి మంజూరు చేసి నిర్మాణం పూర్తి చేసిన ఆ ఆసుపత్రి,మెడికల్ కళాశాలల ప్రారంభోత్సవాలకు రాష్ట్ర మంత్రులు వస్తే బీఅర్ఎస్ నాయకుల అరెస్టులా..? అని
మరీ ఇంత భయమా..? నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఅర్ఎస్ రాష్ట్ర నేత పెద్ది సుదర్శన్ రెడ్డి మండిపడ్డారు.మేమే అంటే ఇంత భయమా.. అని ఆయన ప్రశ్నించారు.నల్లబెల్లి మండల కేంద్రంలోని తన నివాసంలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని స్థానిక పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.అలాగే డివిజన్ వ్యాప్తంగా ఉన్న బీఅర్ఎస్ నాయకులను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్ లకు తరలించారు. ఈ సందర్భంగా పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమకారుల నిర్బందాలను నేడు కాంగ్రేస్ ప్రభుత్వం గుర్తుచేస్తున్నదని ఆరోపించారు.నర్సంపేట మెడికల్ కళాశాల,జిల్లా ఆసుపత్రిని కట్టించిన వ్యక్తిని హౌజ్ అరెస్ట్ చేస్తారా..? అరెస్ట్ లు చేసి పర్యటనలు ఎన్ని రోజులు చేస్తారు..భయం బాగానే ఉంది..!!ఈ నిర్భందాలతో నిజాలు దాగవు,పోరాటాలు ఆగవు అని ఉద్యమ నాయకులు,టీఆర్ఎస్ ఎన్నారై ఫోరం యుకే అధికార ప్రతినిధి శానాబోయిన రాజ్ కుమార్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.ప్రారంభోత్సవంలో గౌరవించవలసిన వ్యక్తిని అరెస్టు చేసి నిర్బంధించడమా..ఇదేనా ప్రజాపాలన అని ఆవేదన వ్యక్తం చేశారు.మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని అక్రమ హౌజ్ అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్న బీఆర్ఎస్ నాయకులు ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *