
భద్రాచలం నేటిదాత్రి
మండల నాయకులు రత్నం రమాకాంత్ మాట్లాడుతూ పినపాక నియోజకవర్గం లో కాంగ్రెస్ చేతుల్లో చిత్తుచిత్తుగా ఓడిపోయిన కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు రేగ కాంతారావు భద్రాచలం నియోజకవర్గం వచ్చి మా ఎమ్మెల్యే పై
అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు కి, నియోజకవర్గ ప్రజలకు, క్షమాపణ చెప్పాలి నీ పార్టీలో ఉమ్మడి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒక్క సీటు కూడా గెలిపించలేని నువ్వు కనీసం నీ నియోజకవర్గంలో కూడా గెలవని నువ్వు నామమాత్రాన బిఆర్ఎస్ టికెట్ అయినా సొంత ఇమేజ్ తో భద్రాచలం నియోజకవర్గం ప్రజల అండదండలతో ఎమ్మెల్యేగా గెలిచిన డాక్టర్ తెల్లం వెంకట్రావు ని విమర్శిస్తే చూస్తూ ఊరుకోం
భద్రాచలం మండల నాయకులు కొండిశెట్టి కృష్ణమూర్తి మాట్లాడుతూ….
పొంగులేటి శ్రీనివాసరెడ్డి తో గొడవ పడి జిల్లాలో చిత్తుచిత్తుగా ఓడిపోయి జిల్లాలో ఒక ఎమ్మెల్యే అని కూడా గెలిపించుకోలేకపోయారు.
భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు ఆయన సొంత ఇమేజ్ మరియు కార్యకర్తల కృషి, అభిమానంతో గెలిచి భద్రాచలం పట్టణ అభివృద్ధి కోరకు , ప్రజల కోరిక మేరకు నేను పార్టీ మారడం జరిగింది తప్ప నా స్వార్థ ప్రయోజనo కొరకు కాదని ముందు నువ్వు గ్రహించాలి.
మండల నాయకులు అరికెల తిరుపతిరావు మాట్లాడుతూ…
అసలు నువ్వు నీకు గురిగింజ సామెత గుర్తుంటే మా ఎమ్మెల్యే గురించి మాట్లాడవు. ఎందుకంటే అసలు నువ్వు బిఆర్ఎస్ పార్టీలో అనుభవించిన పదవులు నీకు కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజలు ఇచ్చిన భిక్ష అది నువ్వు మర్చిపోయి ఈరోజు భద్రాచలం ఎమ్మెల్యే గురించి మాట్లాడే నైతిక హక్కు ముందు నీకు లేదు.
ఇకపోతే భద్రాచలానికి ఏం తీసుకొచ్చారు అని అంటున్నావు కదా… బిఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినప్పుడు మీరు మీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసారా..? అలాంటప్పుడు భద్రాచలం ఎమ్మెల్యే గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు లేదు.
ఎమ్మెల్యేగా ఉండి ప్రభుత్వంలో కీలక పదవి విప్పు మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పార్టీ అధ్యక్షులుగా ఉండి మీరు చేసిన అభివృద్ధిలో జిల్లాలో ఉన్న నియోజకవర్గాల్లో ఒక్క నియోజకవర్గానికైనా మీరు అభివృద్ధి పనులు తీసుకొచ్చినారా.
ఒక నియోజకవర్గానికి తప్ప ఏ నియోజకవర్గాన్ని కూడా నీవు అభివృద్ధి చేయలేదు అట్లానే జిల్లా ప్రెసిడెంట్ అయి ఉండి ఎన్నికలు వస్తే ఒక్క నియోజకవర్గాన్ని కూడా గెలిపించలేక నీవు కూడా జిల్లా ప్రెసిడెంట్గా ఉండి ప్రభుత్వ విప్పుగా ఉండి కాంగ్రెస్ పార్టీ చేతులో చిత్తుచిత్తుగా ఓడిపోయినావు. అది నీకు సిగ్గు లేదా దాని మర్చిపోయి మరల తగుదునమ్మా అని ఇప్పుడు భద్రాచలం సీటు కావాలి ఒకవేళ నీ పార్టీ నుండి నీవు టికెట్ తెప్పించుకున్న భద్రాచలం ప్రజలు నిన్ను చిత్తుచిత్తుగా ఓడగొడతారు.
ఇదే డాక్టర్ వెంకట్రావు ని కాంగ్రెస్ పార్టీ తరపున గెలిపించుకుంటారు. దానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని నువ్వు తెలుసుకో ఏదో బోధించడం నక్క లాగా సరే ఎదురుచూస్తున్నవేమో తెల్లం వెంకట్రావు ని తప్పిస్తే మల్లి ఎన్నికలు వస్తే ఇక్కడ నిలబడదామని ఆశపడుతున్నాయో కానీ ఆశలు భద్రాచల ప్రజలు స్వీకరించరు. ఎందుకంటే భద్రాచలంలో స్థానికుడైన డాక్టర్ తెల్లం వెంకట్రావు రావు ని ఆనాడు పార్టీ గెలిపించలేదు. ప్రజలు డాక్టర్ తెల్లం వెంకట్రావు ని ఎమ్మెల్యే గా ఇక్కడ ప్రజలకు ఉపయోగపడతాడు. ప్రజల పక్షాన నిలబడతాడు. మా భద్రాచలాన్ని అభివృద్ధి చేస్తాడని డాక్టర్ తెల్లం వెంకట్రావు ని ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు.
భద్రాచలంలో అడుగు కూడా పెట్టలేవు రేగా కాంతారావు ఖబడ్దార్…
భద్రాచలం కు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఏమీ నిధులు తెచ్చాడని అడుగుతున్నారు కదా తెలుసుకో చెబుతాం బిఆర్ఎస్ పార్టీలో ఐదు సంవత్సరాల కాలంలో ఒక్క పైసా ఇవ్వని మాట వాస్తవ కాదా? ఎన్నికలు వారం రోజులు నోటిఫికేషన్ వస్తుందన్న సందర్భంగా కరకట్ట కోసం భద్రాచలం అభివృద్ధి కోసం ఆనాడు నాలుగున్నర కోట్ల రూపాయలు మంజూరు చేయించడం జరిగినది. అట్టి పనులు నిలిపివేస్తే ఎమ్మెల్యేగా గెలిచిన డాక్టర్ తెల్లం వెంకట్రావు తర్వాత నాలుగు కోట్లు రూపాయల నిధులు మరియు కరకట్టకు సంబంధించిన 39 కోట్ల రూపాయల నిధులు ఈనాడున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి , ఉపముఖ్యమంత్రి వర్యులు మల్లు భట్టి విక్రమార్క, రెవెన్యూ శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరావు కృషితో దగ్గర ఉండి ప్రత్యేక నిధులు తెప్పించి ఆ కరకట్ట పనులు ప్రారంభించారు. అందుకు ఫలితంగా భద్రాచలంలో ఈ సంవత్సరం గోదావరి రెండుసార్లు వచ్చినా చుక్క నీరు కూడా భద్రాచలంలోనికి రాలేదు.
అట్లానే ఈ మధ్యకాలంలో ఎస్ డి ఎఫ్ నిధుల నుండి నియోజకవర్గానికి 10 కోట్ల రూపాయలు తీసుకొచ్చి అన్ని మండలాలలో డ్రైన్లు, సిసి రోడ్లు, అట్లానే భద్రాచల పట్టణానికి పదిహేను లక్షల రూపాయలతో అంబేద్కర్ సెంటర్ నుండి చర్ల రోడ్డు రాజుపేట కాలనీ వరకు సెంట్రల్ లైటింగ్ మరియు డ్రైనేజీ లను మంజూరు చేయించడం జరిగినది.
ఈ మధ్యకాలంలో భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానానికి 60 కోట్ల రూపాయలను మంజూరు చేయించడం జరిగింది. ఇన్ని కోట్ల రూపాయలు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తున్న మా ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు మీద లేనిపోని అపోలు సృష్టించి ఎన్నికలు వస్తే ఓడిపోయిన మీరు వచ్చి ఇక్కడ నిలబడి ఏదో సాధిద్దాం అని ఉద్దేశంతో మాట్లాడుతున్న విషయాలు ఈ నియోజకవర్గ ప్రజలు గమనిస్తారని నువ్వు తెలుసుకోవాలి.
ఈ కార్యక్రమంలో మండల నాయకులు బొంబోతుల రాజీవ్, నర్రా రాము, మామిడి పుల్లారావు చుక్క సుధాకర్ , గాడి విజయ్ , నాగేంద్ర, రాజశేఖర్ ,తదితరులు పాల్గొన్నారు.రత్నం రమాకాంత్
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం భద్రాచలం