చినుకు పడితే సిసి రోడ్డంతా చిత్తడే చిత్తడి

సైడ్ డ్రైనేజీ కాలువ లేక నాన్న ఇబ్బందులు

పట్టి పట్టనట్టు వ్యవహరిస్తున్న సంబంధిత శాఖ అధికారులు

కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. నేటిధాత్రి..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం తాటి గూడెం గ్రామపంచాయతీ విప్ప చెట్టు గుంపులో సీసీ రోడ్డు సందు బజార్ లో ఉన్న ఇండ్లలకు ప్రధాన రహదారి ఎంత అవసరమో మురికి కాలువ కూడా అంతే అవసరం కానీ మండల కేంద్రంలో సంబంధిత అధికారులు అభివృద్ధిపై చిన్నచూపు చూస్తున్నారని గ్రామ ప్రజలు వాపోతున్నారు గురువారం కురిసిన చిన్నపాటి వర్షానికి మండల కేంద్రంలో పలు విధుల్లోకి సైడ్ కాలువ లేక నీటితో నిండిపోయాయి ఇంటి ముందర ఉన్న సిసి రోడ్ అంతా మురికి నీరై రోజుల తరబడి నిలువ ఉండి ఈగలు దోమలు దాడితో దుర్వాసనలతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు ఇంటి నుంచి పిల్లలు వృద్ధులు బయటకు రావాలంట జంకుతున్నారు ఇప్పటికైనా ఉన్నతాధికారుల స్పందించి శాశ్వత పరిష్కారం కావాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!