* పోలీస్ వారికి రైతులు సహకరించాలి
•ఎస్సై శ్రీనివాస్ రెడ్డి
నిజాంపేట: నేటి ధాత్రి
మండల వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఆరు కాలం పండించిన వరి ధాన్యం మొక్కజొన్న గింజల కుప్పలు రోడ్డుపై ఆరపోసి ప్రామాదాలకు కారణం కాకూడదని నిజాంపేట ఎస్సై శ్రీనివాస్ రెడ్డి బుధవారం మీడియా సమావేశంలో అన్నారు..ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ఎవరు రోడ్డుపై ధాన్యం గాని మొక్కజొన్న గింజలు గాని అరోబోయారదని హెచ్చరించారు. వాహన దారులు కొన్ని సందర్భాల్లో చుసుకొక ధాన్యం కుప్పల పై వాహనం నడిపే ప్రమాదం జరిగే అవకాశలు అధికంగా ఉన్నాయన్నారు. రాత్రీ వేలల్లో వాహన దారులు ఆ ధాన్యం కుప్పలను గ్రహించలేరు. కాబట్టి రైతులేవ్వరు కూడా రోడ్డు పై వరి ధాన్యాన్ని అరోబోయవద్దని కోరారు. తమ ప్రాణాలను నమ్ముకొని వారి కుటుంబాలు ఉంటాయన్నారు. ప్రజలు పోలీస్ వారికి సహకరించాలని కోరారు.