పరకాల నేటిధాత్రి
హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గంలో పరకాల మండలం పోచారం గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా పాల్గొన్న పరకాల బి.ఆర్.యస్.పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి.ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులకు 24 గంటల కరెంట్ కావాలంటే మళ్ళీ బి.ఆర్.యస్.ప్రభుత్వం రావాలని,కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్న రాష్ట్రంలో 24 గంటల కరెంట్ ఇవ్వడం లేదని అన్నారు.ప్రతిపక్షాలు పరేషాన్ చేయడానికి తప్ప పనిచేయడానికి ముందుకు రావు అన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, మండల నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.