
ZPSS HM Swaroopa.
మాదక ద్రవ్యాలు అలవాటైతే బంగారు భవిష్యత్ నాశనం
మహేశ్వరం జడ్పీఎస్ఎస్ హెచ్ఎమ్ స్వరూప
నర్సంపేట,నేటిధాత్రి:
యువత మాదకద్రవ్యాలకు అలవాటుపడితే బంగారు భవిష్యత్‌తో పాటు దేశ భవిష్యత్ నాశనమవుతుందని హెచ్ఎమ్ స్వరూప అన్నారు.
నర్సంపేట మండలంలోని మహేశ్వరం గ్రామంలో జడ్పీఎస్ఎస్ పాఠశాల విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి,ప్రతిజ్ఞ చేయించారు.
ఈ సందర్భంగా హెచ్.ఎం స్వరూప మాట్లాడుతూ సరదా కోసం మాదకద్రవ్యాలు తీసుకుంటే నష్టం తప్పదని, ఇలాంటి సరదాలు వద్దని సూచించారు.
మాదకద్రవ్యాలు సేవించినా, కలిగి ఉన్నా చట్ట ప్రకారం నేరం అని,విద్యార్ధి దశలోనే క్రమశిక్షణతో విద్యనభ్యసించాలని, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు.

కష్టపడి చదివిన వారు ఉన్నత శిఖరాలు అధిరోహించి వారి జీవిత కాలం సుఖసంతోషాలతో ఆనందంగా గడుపుతారని పేర్కొన్నారు.
చెడు వ్యసనాలకు బానిసలై చదవకుండా సంతోషంగా ఉన్నామని ఊహించుకుంటే జీవితమంతా కష్టాలు,శ్రమతో గడపాల్సి ఉంటుందన్నారు.ఇట్టి కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.